జీవితంలో వెలగాలంటే..!

జీవితంలో వెలగాలంటే..!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పిల్లి.హజరత్తయ్య

ఆనందాలు ప్రవాహాలైనా
కోరికలు గుర్రాలై పరుగెత్తించినా
గంభీర జీవనం సాగిస్తేనే
ఉత్తమ సాధకుడవుతాడు..!

కర్తవ్యమనే బాటలో
కష్టాలు పలకరించినా
కార్యదక్షతతో ఫలితాలను సాధిస్తే
స్థితప్రజ్ఞుడై వెలుగుతాడు..!

జీవిత పరిపూర్ణతకై
ఆత్మజ్ఞానం సాధిస్తే
శాంతి కుసుమాలను
అందుకోగలుగుతాడు..!

అలలు వలె ఎగిసి పడక
సముద్రం వలె స్థిరంగా నిలిస్తే
లక్ష్యమనే గమ్యాన్ని
సాధించే స్థిరచిత్తుడవుతాడు..!

You May Also Like

One thought on “జీవితంలో వెలగాలంటే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!