కాలం ఎవరికోసం ఆగదు
రచన: చింతా రాంబాబు
కాలం తను ఒంటరిగా
సాగిపోతూ ఉంటుంది
తనతో కలిసి
అడుగులు వేయమని…
కొన్నిసార్లు కాలం తో నడవాలి
కొన్నిసార్లు పరిగెత్తాలి
ఎన్నో పాఠాలు నేర్పుతుంది
గుణపాఠాలు బోధిస్తుంది
ఎన్నో బంధాలను
అనుబంధాలు అందిస్తుంది
మంచి చెడులు మధ్య
తారతమ్యాలు చూపిస్తుంది
కొత్త పరిచయాలు చేస్తుంది
మనసు చేసే గాయాలను
మాన్పుతుంది.
కాలం ఎవరికోసం ఆగదు.
ప్రకృతి లో
సమస్త జీవరాసుల తో
సఖ్యత తో జీవించమని
ప్రోత్సహిస్తుంది.
ఆధిపత్యం చేస్తే వినాశనం తప్పదని హెచ్చరిస్తుంది.
అందుకే …..
కాలం ఎవరికోసం ఆగదు.
