కమ్మని అనుబంధాలు

(అంశం ::”ప్రేమ”)

కమ్మని అనుబంధాలు

రచయిత :: బొప్పెన వెంకటేశ్

అమ్మ అప్పుడే అరటి ఆకులో భోజనం వడ్డించింది. ఆవకాయ,అప్పడాలు, నెయ్యి, ముద్దపప్పు, రసం అన్ని చూడగానే మహేష్ కు కడుపులో ఎలకలు ఆనంద కేళి తో హాయి గొలుపుతున్నాయి. అందరూ కలిసి భోజనం చేస్తున్నా అమ్మ కళ్ళు మాత్రం కొడుకునే తదేకంగా గమనిస్తున్నాయి.

పొద్దున్నే బెంగళూరు నుంచి వచ్చాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

ఇంకొంచెం తిను బాబు అంటూ కుమారునికి కొసరికొసరి వడ్డిస్తున్న అమ్మను చెల్లి నాన్నలు కాస్త ఆశ్చర్యంగా వీక్షిస్తున్నారు ఇన్ని రోజులు లేని లోటును ఇప్పుడే తీర్చుకుంటుంది అన్నట్లుగా…!

ఇన్నిరోజులు బెంగుళూరులో ఆదరా బాదరాగా కుటుంబానికి దూరంగా ఉండటం….
మరి ఇప్పుడు అమ్మ చేతి వంట రుచి తో మహేష్ కు మండుటెండ లోని ఎడారి నుంచి పచ్చని పందిరి తోటలోనికి వచ్చినట్లు అనిపించింది.అమ్మ చేతివంట ఆరగించే గాని మహేష్ కు సుఖంగా తోచింది.
ఇంటి ప్రశాంత గాలి పీల్చుకోగానే మహేష్ మనసు కుశలం తో శాంతించింది. చిన్నప్పుడు తన జేబులోంచి డబ్బులు దొంగలించిన కొడుకు ఇప్పుడు తనకే సంపాదించి ఇవ్వడం తండ్రికి ఒకింత సంతృప్తినిచ్చినా దూరంగా కూడా దూరంగా నివసిస్తున్నాడు అన్న బాధ కూడా లేకపోలేదు.
ఇక అలా తిని వచ్చాడో లేదో చెల్లితో గిల్లికజ్జాలు షురూ అయ్యాయి……
టీవీ రిమోట్ నాదంటే నాదని మొండి పట్టు పట్టారు ఇరువురు , ఎవరి పక్షాన్ని తీసుకోకుండా కొడుకు కోసం పాయసం చేయడానికి వంటింట్లోకి పయనమైంది పద్మ.

తండ్రీ కొడుకులు మాట్లాడుకుంటూ మధ్యలో నాన్న
పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిర మైన ఉద్యోగం చేయమని అడిగాడు , నాన్న అలా ఆర్తితో అడిగేసరికి నాన్న మాట కాదనలేక సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని బదులిచ్చాడు. పుత్రునితో చాలా సమయం వరకు తనివితీర మాట్లాడిన తర్వాత , అరటి గెలలు కొబ్బరి గెలలు కోసుకురావడానికి మెల్లగా పొలానికి బయల్దేరాడు.

టీవీ చూస్తూ ఉండగానే ఇంటి వెనక నుంచి మహేష్ వీస్తున్న చల్లని చిరుగాలి కి సోఫా లోనే కునికిపాట్లు పడుతున్నాడు మహేష్. సమయానుకూలతను దృష్టిలో పెట్టుకుని తన కోసం ఏం తెచ్చాడా అని ఆతృతగా బాధ అంతా వెతికింది రవళి. బ్యాగులో ఏమి లభించకపోవడంతో రవళి లో అలకలు ఉరకలు వేశాయి. ఈసారి పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయితే ముత్యాలహారం ఇస్తానని హామీ ఇచ్చి బుజ్జగించారు అమ్మ అన్నయ్యలు.
తన ఊరిలో వచ్చిన మార్పులను గమనిస్తూ పచ్చని పొలాల మధ్య నుంచి ఏటి గట్టు మీదుగా మరిచిపోలేని చిన్ననాటి జ్ఞాపకాలతో పొలం వద్దకు చేరారు కుటుంబమంతా.
ఈ వయసులో కూడా నాన్న చేస్తున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు మహేష్ , ఇంతకాలం నాన్న మనసు కష్టపెట్టినoదుకు బాధ పడుతూ ఇకమీదట అలా చేయకూడదు అని నిశ్చయించుకున్నాడు. అంతా చేను గట్టుపై కూర్చుని కబుర్లలో మునిగిపోయారు. అమ్మానాన్నల మమతానురాగాలు చెల్లెమ్మ తో సరదాగా ఆటలు మహేష్ ను మురిపిస్తున్నాయి, తన సొంతమైన ఈ కుటుంబ ప్రేమను వదిలి తనది కానిది అయిన ఎక్కడో ఉండటమా అని మనసు మదనపడ సాగింది.

ఇలా రోజు సరదాగా సంతోషంగా సాగిపోతున్న మహేష్ కుటుంబ అనుబంధాలు, ప్రేమానురాగాలు పట్నం వెళ్లే విషయాన్ని పూర్తిగా మరిపించి వేశాయి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!