అనుబంధాలు మృగ్యమవుతున్నాయా?

అనుబంధాలు మృగ్యమవుతున్నాయా?

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

అమ్మపోయి ఐదు సంవత్సరాలు అయింది. అప్పుడు అన్నయ్య రాఘవ అమెరికా నుంచి వచ్చి యథావిధిగా చేయవలసిన పనులు భార్యతో కలసిచేసి మాతృఋణం తీర్చుకున్నాడు. అమెరికా వెళ్లిపోతూ నాతో చెల్లీ జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అసలే భర్తపోయిన దానివి. భగవంతుని దయవల్ల ఇద్దరు మగపిల్లలు ప్రయోజకులయ్యారు. స్కైప్ లో మాట్లాడుకోవచ్చు ప్రతి సంవత్సరం వస్తానమ్మా అని ఆప్యాయంగా చెప్పి మరీ వెళ్ళాడు.

నాన్నగారు మా చిన్నప్పుడే పోతే అమ్మ తానే నాన్నగా మారి పొలం మీద వచ్చే డబ్బులతో అన్నని ఐ.ఐ.టి మద్రాసులో ఆ తరువాత స్కాలర్ షిప్ తో అమెరికా ఉన్నత చదువుల కి పంపిస్తే అన్నకి దిగ్గజ కంపెని మైక్రోసాఫ్ట్ లో టీం లీడర్ అయ్యాడు అమ్మ చెప్పిన సంబంధం చేసుకుని అమెరికా లో సెటిల్ అయ్యాడు.

నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు, నా సహచరుడు సుధాకర్ తో అమ్మ అనుమతి తోనే వివాహమై ముప్పయి సంవత్సరాలు అయింది .నా పిల్లలు రాము, శ్యాములు ఇంజనీరింగ్ అయినవెంటనే సాప్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చి ఆనందంగా జీవితం సాగుతున్న వేళ నా భర్త సుధాకర్ హఠాత్తుగా గుండెపోటు తో మరణించాడు. ఆ భాధ తో ముదిమి వయస్సులో అమ్మ నా గురించి బెంగతో మరణించింది. ఇది నా జీవితాన ఊహించని పరిణామం.

ప్రతి పండుగ, పుట్టినరోజుకి స్కైప్ లో గంటల కొలది మాట్లాడే అన్నయ్య వాట్సప్ లో శుభాకాంక్షలు అని ఈ మధ్య పెట్టడం నాకు ఎందుకో పట్టలేని దుఃఖానికి కారణమైంది.
పెద్దకొడుకు రాము మామయ్య పనిలో ఉంటాడులే తరువాత చేస్తాడులే ఆఫీసు పని ఎక్కువ గా ఉందేమో అంటే సరిపెట్టు కున్నాను. కానీ మూడు సంవత్సరాల నుంచి ఇలాగే వాట్సప్ లో విషయాన్ని చెపుతున్నాడు.
చిన్నప్పుడు రామకళ్యాణం దేవాలయంలో జరిగినప్పుడు నన్నెత్తుకుని పూజారి గారి తో మా చెల్లికి ప్రసాదం అన్నప్పటి జ్ఞాపకం చెల్లికి ముందు ఇవ్వమ్మా చిన్నది కదా అన్న ఎందుకిలా మారేడు.
అలాగే మేనత్త, మేనమామ పిల్లలు, చిన్నాన్న, పెదనాన్న పిల్లలు చిన్నప్పుడు ఎంత హాయిగా ఆడుకుని ,కబుర్లు చెప్పేవారు ఇప్పడు అపరిమిత కాల్స్ సెల్ లో ఉన్న వాట్సప్ లో మెసేజ్ లు ,పెండ్లికి, చావుకి అంటే మంచికి, చెడ్డకి పెడుతూ ఉంటే అరువది సంవత్సరాలు దాటిన నేను అనుభవంతో చెపుతున్నాను. చాలా మంది పరిస్థితి ఇదే అది చాలామందికి అనుభవమే.
పూర్వం లా ఇళ్ళకి రాకపోయినా అయినవాళ్ళు అరచేతిలో ఉన్న చరవాణి తో మాట్లాడితే ముఖ్యంగా పెద్ద వయస్సువారికి ఆత్మీయులకు మానసిక ఆనందం కలుగుతుంది
నా కెందుకో అనుబంధాలు మృగ్యమవుతున్నాయా అని పిస్తోంది. ఆలోచించండి….!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!