అనుకోకుండా… ఒకరోజు

అనుకోకుండా… ఒకరోజు

రచన: అరుణ చామర్తి ముటుకూరి

అమ్మ  శర్మిష్ట ఆమ్మ కూతురు శరజ్యోతక్క డెలివరీ టైం అవ్వడంతో పెద్దమ్మ భయంతో సాయానికి రమ్మంటే వెళ్ళింది. లేకుంటే ఈ వర్షంలో హాయిగా అమ్మ చేసే పకోడీలు తింటూ బాల్కనీలో కూర్చుని సన్న సన్న గా పడుతున్న జల్లుని ఆస్వాదిస్తూ ఉండేవాడిని.

సరేలే స్వి గ్గిలో మంచూరియానో ఏదో పెట్టుకుంటా. అయినా దానికి ఆ పేరు ఏంటో. వేడి వేడిగా తినే హాట్  కి మంచు అని . ఏ స్పానిష్, ఇటాలియన్ అయి ఉంటుంది లే. ఈ పూటకి నాన్న కూడా ఆఫీస్ నుంచి రానని చెప్పేశారు. వర్షం వల్ల అక్కడ ట్రాఫిక్ అంత ఇబ్బందిగా ఉండడంతో తెగిన చెరువు నీరు రోడ్ల కడ్డం పడడంతో ఆఫీస్ లో కొందరు పక్కనే ఉన్న హోటల్ నుంచి తెప్పించుకొని తిని అక్కడే ఉంటామని నిర్ణయించుకున్నారట. ఏం చేస్తాం ఒకోసారి తప్పదు. ఈ వర్షానికి స్విగ్గి వాళ్ళు కూడా ఎవరూ కదిలే పరిస్థితి లేదు.
ఇంట్లోకి వెళ్లి చూశాను తినడానికి ఏమి ఉన్నాయాని. టమాటా కర్రీ ఉంది. బ్రెడ్ ఉంది ప్రస్తుతానికి శాండ్విచ్లా లాగించేయొచ్చు. కాస్తంత వేడి కాఫీ తాగితే సరిపోతుంది. అనుకుంటుండగా.. బెల్ మోగిన శబ్దం వినిపించింది. నిజమేనా కాదా అని వెంటనే వెళ్ళకుండా ఆగి మళ్ళీ వింటే  మోగుతూఉన్న మాట నిజమే. వెళ్లి చూస్తే పాపం ఎవరో అమ్మాయి, వర్షంలో పూర్తిగా తడిసిపోయింది.

“అయ్యయ్యో !లోపలికి రండి”

సారీ అండి! వీణ క్లాస్ కెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే ఇటువైపు వర్షం బాగా పెరిగిపోయింది. జారి పడబోయాను కూడా. తప్పక మీ ఇంటి తలుపు తట్టాను కానీ, నా బట్టలన్నీ తడిసిపోయాయి కదా మీ ఇంట్లోకి వస్తే ఇల్లు తడుస్తుంది”

” భలేవారే అలాగని ఎంత సేపు అలా ఉంటారు .రండి” మరి అలాంటప్పుడు బెల్లు ఎందుకు కొట్టినట్టు మనసులో అనుకున్నాను.

“ఆంటీ లేదా అండి”?

“అమ్మ అక్క డెలివరీ ఉంటే మా పెద్దమ్మకి సాయానికి  వెళ్ళింది.”

“అయ్యో !ఆంటీ ఉండుంటారు అనుకున్నాను. నేను ఆంటీ ఫ్రెండ్ కూతురు”

“పర్లేదు రండి, అమ్మ లేకుండా నేను ఆతిథ్యం బాగానే ఇవ్వగలను ఈ వర్షం లో ఎలా వెళ్తారు”

గెస్ట్ ల కిచ్చే టవల్ ఇచ్చి అమ్మ చుడిదార్ ఒకటి , ఇచ్చాను మార్చుకోమని. ఈ అమ్మాయికి అది కొద్దిగా లూస్ అవ్వచ్చు. అమ్మ కూడా చక్కగా ఉంటుంది కానీ ఈ అమ్మాయి మరీ చిన్న పిల్ల కాబట్టి, పొందిగ్గా ఉంది.”

ఆలోచనలకు ఉలిక్కిపడ్డాను. ఇంత వర్షంలో వయసులో ఉన్న అమ్మాయి నాతో పాటు ఉంది. ఎన్నో సినిమాల్లో నవలల్లో  సన్నివేశాలు బుర్రను చెద పురుగుల తొలుస్తుంది. వీణ నేర్చుకోవడం ఏమోగానీ మీటి నట్లే ఉందామె గొంతు.
నా ఆలోచనల్లో నేనుండి అమ్మాయి బట్టలు మార్చుకోలేదని గమనించలేదు. చూసి అడిగాను
” ఏంటండీ మార్చుకోండి, జలుబు చేస్తుంది. దారులన్నీ మూసుకుపోయేయట.”

“మార్చుకుంటానండి. గీజర్ వేసుకుని వచ్చాను తల స్నానం చేస్తే జలుబు చేయదని”
“అమ్మొ కాస్త అలుసిస్తే…, మనసులో అనుకొని ఓ అలాగా సరే అయితే అని రాని నవ్వు నవ్వాను.

“తినడానికి ఏమైనా ఉన్నాయా ?”చనువుగా వెళ్లి ఫ్రిజ్ ఓపెన్ చేసింది.

మరీ అంత చనువు నాకు నచ్చడం లేదు. ఫ్రిజ్ ఓపెన్ చేసినప్పుడు గమనించా..
చూడచక్కని రూపు సన్నని నడుము , బాగుందీ అమ్మాయి.
అందులో ఉన్న ఆపిల్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళి కడుక్కొని చాకుతో కట్ చేసుకుని తింటూ నీకు కావాలా అని అడిగింది. ఉలిక్కిపడ్డాను
అసలు పరాయి ఇంట్లో ఇలాంటి సిచువేషన్ లో ఒంటరిగా ఉన్న అబ్బాయి ఏ మాత్రం భయం లేదు . ఏంటో ఈ కాలం అమ్మాయిలు.. “వద్దు మీరు తినండి”

“నేను వచ్చి అరగంట అయింది కదా! ఇంకా మీరు ఏమిటి నువ్వు అనుకుందాం. నా పేరు సింధు. మీ పేరు?”

అలా ఓ పది నిమిషాలు కబుర్లలో పడ్డాం. నీళ్లు కాగి ఉంటాయని తలస్నానానికి వెళ్ళిపోయింది. ఆ చొరవ చూస్తుంటే ఎందుకో వేరే ఆలోచనలు వస్తున్నాయి.
స్నానం చేసింది. అమ్మ డ్రెస్ కొద్దికొద్దిగా లూస్ గా ఉంది కానీ బానే ఉంది. తల నుండి నీళ్ళు కారుతున్నాయి. అలాగే వచ్చి , గట్టిగా నా నుదిటి మీద నీళ్లు పడేలా తల విదిలించింది. ఏయ్ అంటూ పట్టుకుని లాగేసరికి నా ఒళ్ళో వచ్చి పడింది. ఒక క్షణం ఇద్దరికీ కాలం స్తంభించినట్టయింది. ఒకరి ఊపిరి ఒకరికి తగిలినంత దగ్గర గా ఉన్నాము.
“హలో! హలో మాస్టారు నిద్రపోయారా !”ఆ పిలుపు నన్ను ఈ లోకం లోకి తీసుకు వచ్చింది.
హమ్మయ్య ఇదంతా కల.
నిజమే అమ్మ పెంపకంలో నాకసలు ఇలా ఆలోచన రాకూడదు. తల విదిలించుకుని.. ఉన్న కూర బ్రెడ్ ఇద్దరం తినేసాం. అదృష్టం కరెంటు పోకపోవడంతో, నూటొక్క జిల్లాల అందగాడు సినిమా  పెట్టి  చూశాము. సిందు ని గెస్ట్ రూమ్ లో పడుకోమని చూపించి, నేను నా రూం కి వెళ్లి పోయాను.
పొద్దున లేట్ గా లేచాను. రాత్రి అంతా లీలగా గుర్తొచ్చాక బయటకు వచ్చేసరికి, సింధూ ఎక్కడా కనిపించలేదు. జరిగింది అసలు నిజమేనా లేక కల. నిజమైతే  ఏమైంది? కొంపదీసి ఇంట్లో ఏం పోలేదు కదా?
బాల్కనీలో అమ్మ చుడిదార్ ఆరేసి ఉంది అంటే, రాత్రి అమ్మాయి వచ్చింది నిజమే. అమ్మయ్య అమ్మ నేర్పిన సంస్కారం నన్నే తప్పు చేయకుండా ఆపింది. ఇంతకీ అమ్మా యి ఏమైనట్టు?
వెతుకుతూ లివింగ్ రూం లోకి వచ్చేసరికి అక్కడ లెటర్ , ఎగురుతూ కనబడింది వెయిట్ కింద.
తీసుకొని గబగబా చదివాను
మాస్టారు చాలా థాంక్స్ అండి. రాత్రి ఆ సమయంలో అలాగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. పొద్దున్నే లేచి వెళ్ళి పోతున్నాను. మీ ఇంట్లో ఏ వస్తువులు కొట్టయలేదు లెండి. ఇకపోతే మీరు నిన్న మాటల్లో అమ్మ ఫ్రెండ్స్ నాక్కూడా తెలుసు చాలా మంది , మీ మదర్ పేరేంటి  అని అడిగినప్పుడు నా రహస్యం బయట పడి పోతుందేమో అని భయపడ్డాను. నోటికి వచ్చిన పేరు సంయుక్త అని చెప్పాను. విన్న మీరు ఒక క్షణం నా వంక నిశితంగా చూడడంతో భయమేసింది. నిజానికి నేను మీ అమ్మ ఫ్రెండ్ కూతురు ని కాను. ఆ పరిస్థితుల్లో ఇంటికి చేరే మార్గం లేక అలా చెప్పవలసి వచ్చింది. మీ మదర్ ఉండి ఉంటే ఉన్న విషయమే చెప్పేదాన్ని. బాగా చనువుగా ఉన్నట్లు అయితేనే నమ్ముతారని కొంచెం అతి చనువు గా ప్రవర్తించాను. మన్నించాలి. కానీ మీ వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది. ఆ పరిస్థితి, వాతావరణంలో కూడా మీరు మీరు లా ఉన్నారు.  ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి హాట్ డ్రింక్స్  ఉన్నాయేమో అని చూశాను. అపార్థం చేసుకోకండి నాకా అలవాటు లేదు. మీరేమైనా అలవాటున్నవారేమోనని. అదే అయితే నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకన్నమాట. అయినా నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ అనుకోండి పైగా పేపర్స్ కు కూడా ఉంది నా ఏదో మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా మరి. అవేవీ అవసరం రాకుండా ఈ వర్షం సాక్షిగా నాకు మంచి స్నేహితుడు దొరికాడు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే నా నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ చేయొచ్చు.
వర్షపు స్నేహితురాలు సింధు
అది చదివిన తర్వాత నాకు విషయం అర్థం అయి ఉంటుంది అని అనుకుంటున్నారు కదూ మీరంతా. కానీ ఆ అమ్మాయి సంయుక్త అనే మా అమ్మ స్నేహితురాలు పేరు చెప్పినప్పుడే నాకు అర్థం అయింది ఆ అమ్మాయి అబద్ధం చెబుతోందని. ఎందుకంటే సంయుక్త ఆంటీ కి ఒక్కడే కొడుకు. ఆపదలో అవసరం తప్పక వచ్చింది. అందుకే నేను కూడా నమ్మినట్లుగా నటించి, ఆ అమ్మాయికి కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా చూశాను. ఆ విషయం ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాలి. ఇది ఓ వర్షం కురిసిన నాటి సాయం. స్నేహం చేసి చూద్దాం అమ్మకు నచ్చితే తర్వాత ఆలోచన చేయవచ్చ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!