మహిళ
(ప్రక్రియ: సూర్య వర్ణము)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారు మంచి వాణి ప్రభాకరి
మహిళా విజయం
నీ ప్రగతి కోసం
అనంత కృషిలో
ప్రతి వ్యక్తి మంచి
సహకారం ఇస్తు
వృత్తి ప్రవృత్తిలో
కుటుంబ సభ్యులు
ప్రేమ తో ఆనందం
పంచి పెడితేనే
నీకు ఘన కీర్తి
మంచి మానవత్వం
పెంచి పంచుతున్న
నీ మనసు ముందు
మా సహా కారము
విలువ సూక్ష్మము
నీ సాధికారతే
నీ కృషికి జయం
విద్య ఉద్యోగంలో
విజయ సాధన
నీకు అభయ ము
స్త్రీ ప్రగతి దేశ
ఉన్నతికి మార్గం
ఇది పురాణాల
సత్య శోధనలో
విషయ జ్ఞానము