సమ్మోహనాలు

సమ్మోహనాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

౧)
కమ్మనిది నా భాష
భాష తీయని భాష
భాష మెరుగైన మాతృభాషది
సోదరీ…!

౨)
అజంతముల భాషది
భాష అందమైనది
అందాల అక్షరాల భాషయది సోదరా…!

౩)
పద్య ప్రత్యేకతతో
ప్రత్యేక పదములతో
పద సొగసుతో వెలిగేది తెలుగు సోదరీ…!

౪)
మెలగాలి సఖ్యంగా
సఖ్యతతో ఐక్యంగా
ఐక్యతతోన ఉండాలందరు
మానవా…!

౫)
మానవతను మరువకు
మరచిపోయి మసలకు
మసలుతు మెసలకు దానవునిగా మానవా…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!