ఒకొరికొకరు జతగా

ఒకొరికొకరు జతగా

దోసపాటి వెంకటరామచంద్రరావు

జతలేనిదే జీవితంలేదు
ప్రకృతి ప్రసాదించిన వరమదే
సహజసిద్దమైనది సాహచర్యం
తోడు నీడ ఉండాలంతే!
ఒకొరికొకరు జతగా…సాగాలంతే!
కష్టాలకు కన్నీళ్ళకు కావాలి
ఆనందాలకు సంతోషాలకు కావాలి
వేసే ప్రతి అడుగులో ఒక దన్నుండాలి
చూసే ప్రతిచూపుకు ఒక మెరుపుండాలి
ఆడే ప్రతిమాటకు సమర్ధనుండాలి
పాడే పాటకు వంతుండాలి
చీకటివెంట వెలుగు
నీటికి నిప్పు
గెలుపుకు ఓటమి
మనిషికి సాటి మనిషి
తనకు తననీడ
వీడలేని
విడదీయలేని
బంధాలే
ఎప్పటికి
ఎన్నటికి
తోడు నీడగా సాగాల్సిందే!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!