మనసారా.. నవ్వు

మనసారా.. నవ్వు

రచన:: హసీనాఇల్లూరి

నవ్వు ఎవరు నవ్వినా నవ్వే కదా…
ఆ నవ్వు ఎవరు నవ్వినా మనసుకు ఆహ్లాదమే…
కానీ ఈ రోజుల్లో నవ్వుకి
విలువ మారిపోయిందేమో అనిపిస్తుంది

నవ్వుని చూసి కుల్లే మనుషులు కొందరు…
నవ్వుని చూసి రగిలే మనుషులు కొందరు…
నవ్వుని చూసి ద్వేషించే మనుషులు కొందరు…
నవ్వుని చూసి అసూయ పడే మనుషులు కొందరు…

ఎందరు కుళ్ళిన, రగిలిన,ద్వేషించిన,అసూయ పడిన
నీ నవ్వుని ఎప్పుడూ ఎవరి కోసం దూరం చేయకు…
ఆ నవ్వే నిన్ను నడిపే జీవన ఇంధనం…
ఆ నవ్వే నీ మనసుకు నవనీతం…

నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం
ఇప్పుడు ఎలా అయ్యింది అంటే…
నవ్వకపోవడం ఒక రోగం అని చెప్పేలా…
కాబట్టి నవ్వండి, నవ్వించండి, జీవించండి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!