(అంశం:”సంధ్య వేళలో”)
జీవిత సంధ్య
రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు
సంధ్య ఆత్మీయంగా కలిసిన వేళ నా ఆనందానికి హద్దులు లేవాయె
సంధ్య పలికిన ప్రతి పలుకు తెనెలొలుకు ఉదయ సంధ్యారాగమే
సంధ్య కలిసిన ప్రతి ఘడియ అమృత ఘడియలే
సంధ్య కలిసిన ప్రతి
రోజూ వసంతం ఋతువే
ఏమైందో ఏమో నా జీవితం అసుర సంధ్యగా గజిబిజిగా మారింది
అంతం కాబోయే రేయికి, ఉదయించే కిరణాల మధ్య సంధ్య వేళలా, అందంగా నా జీవిత సంధ్య వచ్చే రాక కోసం మౌనంగా ఎదురు చూస్తూ వుంటా
…