భగ భగ మండేకాలం – ఎండాకాలం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: దొడ్డపనేని శ్రీ విద్య
ఎండాకాలం భగ భగ మండేకాలం
నోళ్లు ఆర్చుకు పోయే
చల్లని నీరే కరువాయే
కరెంటేమో ఉండదాయే
మల్లెలు పూచే కాలం
సుమ గంధాలు వీచే కాలం
కుండ నీరు చూచి నో్రూరే
ఒంట్లోని నీరు ఆవిరాయే
దప్పిక తో విల విల్లాడే
వడ దెబ్బతో అల్లాడే
ఎర్ర ఎర్రని కొలిమికాలం
వేసవి మజిలీ కాలం
రోళ్లు పగిలే రోహిణీ కాలం
రుతుపవనాల కొరకు వేచేనే
జనుల బతుకే వేదనాయనే
పచ్చ పచ్చని అయిదోతనం నేలరాలినే
తరువులు మోడై పోయేనే
జాజులు తలలో తురిమే కాలం
పరిమళాలు విరజల్లే కాలం
భగ భగ మండేకాలం
ఈ ఎండాకాలం