అన్నదాత

అన్నదాత

రచన: వనపర్తి గంగాధర్

దేశానికి వెన్నెముక
ప్రపంచానికి అన్నదాత
దేశం తీర్చలేని ఋణదాత
శ్రమ జీవన సంధాత

ఆయన శ్రమతో మాగాణాలు
పైరులతో పావనమైతాయి
ఆయన శక్తే లోకానికి ముక్తి
శ్రమను దాచుకోని కష్టజీవి రైతన్న

ఆరుగాలం కష్టపడి లోకానికి
అన్నం పెట్టే అన్నపూర్ణ
లోకం కడుపు నింపే ప్రధాత
కానీ అతని కడుపు మాత్రం కాలీనే

పైరులన్ని తనయె అయినా
గింజ మిగుల్చుకోని బికారి
ఆస్తులేమి దాచుకోని
పుడమి తల్లి ముద్దుబిడ్డ రైతన్న

అవనిలోని అమృత మూర్తి
శ్రమ జీవనానికి ఆదర్శ మూర్తి
అతనో కర్షక వీరుడు
తన రక్తాన్ని స్వేదం చేసి
తన శక్తిని శ్రమగా చేసి
లోకం ఆకలి తీర్చే ప్రాణదాత రైతన్న…!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!