మనసు

మనసు

రచన: చెరుకు శైలజ

మనసా నీకు ఎలా చెప్పాను
నన్ను వీడి ఎటో పరుగెత్తకు
నేనేమో భూమిపైన
నీవేమో ఆకాశంలో విహారిస్తే ఎలా
నేను ఒంటారినైపోను
మనసు లేని రాయి మనిషినైపోను
అందుకే నువ్వు నా దగ్గరే నన్ను అంటి పెట్టుకొని ఉండు
లేనిది ఉన్నట్లు ఊహించుకుంటు
ఆకాశానికి నిచ్చెనలు వేయకు
ఉన్నంతలో తృప్తిగా నువ్వు నేను కలిసే పయనిద్దాం సంతోషంగా.
నీ లేనిపోని ఆశలతో నన్ను భ్రమలో పడవేయకు
భరించడం నాకు కష్టం అయిపోతుంది.
ఎవరో అందనంత ఎత్తుకు ఎదిగారు
అని నన్ను ఆత్రుత పెట్టకు
అక్కరకురాని అన్ని విషయాలు నాకు చెప్పి
నా ప్రశాంతను భంగం చేయకు.
ఐశ్వర్యం అనే ఊబిలో నన్ను బంధించేయకు
నాకు ఉన్నంతలో నేను సంతోషంగానే ఉన్నాను
నీ దూకుడు ఆపు నీవు నా ఆధీనంలో అనుకువగా ఉండు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!