ప్రాప్తం

ప్రాప్తం

రచన::మంగు కృష్ణకుమారి

కరకరలాడే ఆకలి వేస్తుంటే ఏవి
కనపడ్డా ఆనందంగా తినే మనసుంటే
దిక్కులు చూసే పసితనంలో మంచి
నీళ్ళు తప్పితే మరేవీ లేవు!

అత్తింట్లో ఏదో ఆపాటి ఉన్నా పిల్లలూ
అత్త మామలూ, అతిథులూ అందరికీ
వడ్డించేసరికి నాలాటి సగటు గృహణి
ఆఖరికి తినేది పులుసూ,ఆవకాయా
మాత్రమే! ఏ పండగలకో కాస్త పులిహారా

టేబుల్ నిండా వంటకాలు,
పుల్లారెడ్డికి బాబులాటి వారు చేసిన
మిఠాయిలూ, బజ్జీలు పుణుకుల పొట్లాలు తెచ్చే
పనివారు ! ఏం లాభం? తినాలేను
తింటే చుట్టు ముట్టి ఉన్న సుగర్ బిపి
లివర్ జబ్బులూ! దీన్నే కాబోలు
ప్రాప్తం అంటారు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!