ధూమపానం
రచన::మోదేపల్లి. శీనమ్మ
పొరపాటున హరివిల్లే ననుకొని
సిరి నిలయపు తొలి మెట్టనుకొని
దరిచేరి ఆదరంతో ముట్టుకుంటే
నూరేళ్ళ నిండు జీవితం
విష వలయపు కోరలకు చిక్కుకుంటుంది
బయట పడే దారిలేక
కాయమంతా మసిబారేలా కాల్చుకుంటూ
బతుకులు బలి చేసుకుంటున్నారు
గమ్మత్తుగా ఉంటుందని ప్రారంభిస్తే
ఉన్మత్తును చేసి విడచి పెడుతోందది
జలగ రాక్షసిలా పట్టుకు పీడిస్తుంది
హాయి అనిపించే అనుభూతి
అందమైన జీవితాన్నే చిదిమేస్తుంది
భహిరంగ ప్రదేశాల్లో సాగించే ధూమపానం
భాహాటంగానే అమాయకుల పాలిట శాపం
తాను అధోగతికి దిగజారుతూ
తోటి వారిని తోడు కోరడం న్యాయమేనా ?
ధూమపానం ఒక స్టేటస్ కాదు
దూరం చేసుకోవలసిన దురలవాటు
యువత తెలియక చెడిపోతుంటే
తెలియజెప్పడానికి మనం మారలేమా !
ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోండి
అందము ,ఆరోగ్యమైన జీవితాలను అందించండి.