ఎవరికి తెలుసు

(అంశం:” ప్రమాదం”)

ఎవరికి తెలుసు

రచన::బండి చందు

నడిరోడ్డుపై నెత్తుటిమరకలు
అందంగా ఆవులిస్తున్నాయి
రుదిరం ఏరులై పారుతూ
కన్నీటి కాళ్ళు తడుపుతుంది
ఈ మలుపు ఏ గెలుపు తలుపు
తీయకమునుపే అర్దాంతరంగా
అవసరమై ముగిసిపోయింది
ఏమో ఎవరికి తెలుసు
ఏ క్షణం ఊపిరి యమపాశమై
మెడ చివరన బిగుసుకుంటుందో
తీయాల్సిన శ్వాసే మరు నిమిషానికి
నిండు జీవితాన్ని నింపాదిగా వదిలేస్తుందో
అసలు పరిచయమే లేని యుద్ధం
నువ్వైనా నేనైనా చేయాల్సిందే
సాహసమే కానీ చేయక తప్పదు
మజిలీనే అయినా దాటక ఒప్పదు
ప్రాణాలే పణంగా పోరాడాల్సిందే
ఓపిక ఉన్నంతవరకూ కాదు
మన ఊపిరి ఆగేంతవరకు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!