(అంశం:” ప్రమాదం”)
పరివర్తన
రచన::సుశీల రమేష్.యం
ప్రమాదపుటంచున ఉన్న
భూమాత ను సంరక్షించే
బాధ్యత మనందరి మీదా
ఉన్నదన్న సంగతి మరచిన
మనకు ప్రక్రృతి వైపరిత్యాల
సాక్షిగా ఎన్నడూ లేనంతగా
ఒక్కొక్క ప్రమాద ఘంటికను
సూచన ప్రాయంగా తెలియ
జేస్తున్నా, మేలుకోని జనాంగం
యొక్క జలసమాధి ఖాయం.
ఇది నిక్కమని తెలిసినా
నా దాకా రాలేదన్న ధీమాను
వదిలి నీ వంతు పరిరక్షణ
నీ అడుగుతోనే మొదలు పెట్టిన
ఎంత మేలు, సొంత లాభం కొంత
మానుకుని ముందు తరానికి
ఏమివ్వదలచావో ఆలోచించవోయి.
******