సమర ధీర

సమర ధీర (పుస్తక సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: పి. వి. యన్. కృష్ణవేణి

సమరంలో ఎదురీది నిలబడి విజయం సాధించిన ధీరులు గురించి వివరించే కవితల సమాహారమే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సమరంలో పాల్గొనే వాళ్ళు స్త్రీలు. ఆ విజయం సాధించే వారే మగువలు. వీళ్ళు అబలలు కారు సబలలు అనే విధంగా సాగే ఆ కవితా సౌరభం చదువుతుంటే సమయమే తెలియదు. ఇక పోతే, ఈ పుస్తకం రచన వివరాల గురించి మాట్లాడలంటే, ఒక్కరు కాదు, ముప్పై నాలుగు మంది కలసి రచించిన మహా కావ్యం ఈ పుస్తకం. ఎందరో కవయిత్రులు, మరెందరో భావకవులు కలయిక ఈ పుస్తకం.
ఆన్లైన్లో జరిగిన ప్రత్యక్ష ప్రసారానికి అక్షర రూపం ఈ పుస్తకం. శాంతి కృష్ణ గారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, మన తెలుగు వారి ప్రతిభ ప్రస్పుటమయ్యింది. ఎన్నో ప్రాంతాల కవులతో ఈ కవితా సంపుటిని ప్రచురించారు. అలాగే, ఆ పోటీలో గెలిచిన వారికి, ఆ పుస్తకంలో భాగస్వామ్యం అయిన వారికి సన్మాన సత్కారాలను అందించి, ఆనందంలో ముంచెత్తారు.
ఆ సంబరంలో నేను కూడా భాగస్వామ్యం అవ్వటం నాకు సంతోషాన్ని కలిగించింది. ఇందులోని ప్రతి కవితా ఒక ఆణిముత్యమే అనిపిస్తుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!