ఆశ్రమ సుధలు

ఆశ్రమ సుధలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

ఆశ్రమ సుధలు
రచన: నారు మంచి వాణి ప్రభా కరి

సమీక్షకులు: నారు మంచి వాణి ప్రభా కరి

ఆశ్రమ సుధలు నవలలో నేటి ఆధునిక జీవితంలో వృద్ధుల సమస్యలకు అనుగుణంగా నారు మంచి వాణి ప్రభా కరి రచించారు. ఇది నిత్యా మాసపత్రికలో ఫిబ్రవరి సంచికకు అనుబంధ నవల గా, ఆ పత్రిక వారు పాఠకులకు అందించారు. ఈ కథలో పాత్రలు అక్కా, చెల్లెళ్ళు గొప్ప వ్యక్తులు. అక్కలు పెళ్లి, పిల్లలు ఉన్నా వ్యక్తిత్వం కోసం ఉద్యోగాలు చేశారు. పార్ట్ టైమ్ ఉద్యోగంలో జీతాలు తక్కువ, పని ఎక్కువ. దాన్ని చూసి ఇద్దరు చిన్న అమ్మాయిలు ముందు చదువు, ఉద్యోగం తరువాతే పెళ్లి అన్నారు. ఉద్యోగం వద్దు అన్నవారి నీ మా కొద్దు మేము సమాజ సేవలో గాంధేయ వాదులుగా జీవించి మరింత మందికి జీవితాన్ని ఇస్తాం అన్నారు.
ఆ నేపథ్యంలో అధ్యాపకులు ప్రధాన ఆచార్యులుగా పదవి విరమణ చేసి సొంత ఊరు వచ్చి ఈ విధంగా వృద్ధులను ఆదుకునీ యువతకు విభిన్న విషయాల్లో అవగాహన ఇస్తు ఉండేవారు. ఇంకా నవలలోకి వెడితే జీవితం చాలా పవిత్ర మైనది, విచిత్ర మైనధి
విభిన్న ఆలోచనా సరళిలో అంతరాల తరాల మార్పులు మనిషిని అతలా కుతలం చేస్తాయి. పుట్టింట సుఖ పడిన వారు అత్తింటి సుఖ పడటం కస్టం అని సామెత. వియ్యం అయినా కయ్యం అయిన సమదంతా దారులు ఉండాలి. స్పందన ఈ నవల యువ హీరోయిన్ కోడల్ని రక రకాల భాధలు పెట్టీ సంతోష పడి తన కూతుళ్లను గొప్పగా చెప్పే తల్లులు ఉన్నా, ఈ తరహా తల్లులు ఎక్కువ మంది ఉన్నారు. ఇంటికి వచ్చిన కోడల్ని విమర్శించి కొడుకు చేత దాన్ని పుట్టింటికి పంపు అనే రీతిలో ప్రవర్తించి వృద్ధాప్యంలో దారీ లేక ఆశ్రమాల్లో ఉంటున్న కథనాలు. ధరణి, భరణి ఆశ్రమ నిర్వాహకులు జీవితం కోల్పోయిన వ్యక్తులకు మానసిక వత్తిడి తగ్గించు కోవడానికి ఎన్నో ఏర్పాట్లు చేశారు. వ్యర్థ పదార్థాలుగా వృద్ధులు ఈ సమాజంలో ఎన్నో పాట్లు పడుతున్నారు. స్పందన అటువంటి ఆశ్రమానికి
సర్వోదయ ఆశ్రమాల పై పరిశోధన కోసం వచ్చి అక్కడే స్థిర పడి జీవితంలో ఎన్నో విలువలు నేర్చుకున్నది. ప్రతి వ్యక్తి జీవితంలో క్షీర సాగర మధనం ద్వారా ఎన్నో విశిష్టతలు పొందుతారు.
వేదాలు శ్రీ మహాలక్ష్మి, చంద్రుడు, శ్రీ ధన్వంతరీ వేంకటేశ్వరుడు, కల్పవృక్షం కామ దేనువు, హల హాలం అన్ని పుట్టాక అమృతం పుట్టింది. అందుకే క్షిరభి కన్యక కు, శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నిరంజనం, నిరంజనము అనే కీర్తన శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో రాసి పాడారు.
స్పందన ఢిల్లీలో పుట్టి పెరిగి, ఒక చిన్న ఊరిలో స్థిర పడటం ఒక విన్నూత్న విషయము. కొంత విదేశీ సంస్కృతి సంప్రదాయాల వల్ల యువతలో మార్పు వచ్చింది. కానీ ఈ నవల హీరో అందుకు భిన్నంగా ఉంటాడు. ధనం మూలం ఇదం జగత్ కాక పెద్దలు కూడా పిల్లల్ని జాగ్రత్తగా సంస్కరం నేర్పుతూ పెంచాలి. ప్రభుత్వం నుంచి వృద్ద పించనులు వస్తున్నా, అవి పుచ్చుకుని పెద్దల ఆదరణ నేర్చుకోవాలి. అని ఈ నవల యొక్క ముఖ్య ఉద్దేశ్యము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!