సమాజం

సమాజం (కవిత సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: సుజాత కోకిల

ఆడపిల్ల తన మనసుకు నచ్చిన వాడితో ఎన్నెన్నో కలలు కంటుంది. తన ఆశలు నెరవేరాలని, మంచి మనసు ఉండాలని, తనతో ఏడడుగులు నడిచిన వాడితో జీవితాంతం సుఖంగా ఉండాలని
తను కలలు కంటుంది. తన కోరికలు నెరవేరాలని
కొత్త ఆశలతో మెట్టినింట్లో అడుగుపెడుతుంది. మనసుతో గుసగుసలాడుతు. కలలు కంటుంది.
హద్దులు దాటకుండా హద్దుల్లో ఉంటే ఆడపిల్లకు మంచిది. కోరికలే గుర్రాలైతే అన్నట్టుగా ఉంటే
చాల ప్రమాదం, సర్వసాధారణంగా నిజ జీవితంలో కొందరి జీవితాలలో ఇలా జరుగుతూ ఉంటాయి.

కవిత: సమాజం
రచన: సుజాత కోకిల.

పడుకుందామంటే కునుకు పట్టదాయె
ఎన్నెన్నో వలపులు నా మదిని చేరెే
మనసు చెదిరి కునుకు పట్టక నిద్రచెడిపోయే
కొత్త  ఊహలతో కలలెన్నో కంటిని
లేద్దామంటే కలగానే ఉంటుందనే భయం
నన్ను తుంటరి అల్లరి నన్ను వేధించెే
నా వయసు ఆగనంటు.
చెలి చెంతకు చేరమంటు
కొత్త సరిగమలు పాడమంటూ
నా మనసు గిలిగింతలు పెట్టి కొత్త ఊహలు చిగురించేలా చేసే నీ రూపం నాలో నిలిచే
నా ఊహల పందిరిలో కొత్త ఆశలు చిగురించే
పెళ్లి భాజాలు మోగే నా మేను పులకరించెే
మేమిద్దరం ఒక్కటయ్యామనే సంతోషం
లేకుండా చేసే మా ఆశలు నీరుగారెే
మాకో శత్రువు ఆషాడం వచ్చే.
మా ఇద్దరినీ దూరం చేసే
మాలో నిరాశ మొదలాయే
పట్టెమంచం వెక్కిరించే మల్లెపూలు నిరాశగా చూసే
ఎందుకు ఆశ ఎందుకు నిరాశ మనసు చచ్చే
ఎందుకు మేల్కోవడం కలలు కంటే సరిపాయె.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!