గజల్ సమీక్ష

చంద్రకళ గారు రాసిన గజల్ కు నా సమీక్ష(గజల్ సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: సావిత్రి ప్రసాద్ గునుపూడి

ఇందులో ఒక అభిసారిక తన చక్కనోడు కోసం ఏ రకంగా ఎదురు చూస్తుందో చంద్రకళ గారు ఈ గజల్లో చెప్పారు. కట్టుకున్న దానికి మొగుడు ఎప్పుడు రాజే అందుకని మొదటి షేర్ లో నా రాజు నీవే అంటూ పిలిచింది. తర్వాతి షేర్లలో అతని రాక కోసం ఎదురుచూస్తూనే, వస్తే తను ఏ రకంగా ముస్తాబయిందో చెప్పింది. తను వస్తే పువ్వులతో పూజించుకుంటానని, హారతులు ఇచ్చుకుంటానని తన ఆరాధన భావం తెలిపింది. మాపటేల అయ్యేసరికి అతని కోసం ఎదురుచూసి ఎదురుచూసి, చివరికి దీపంలో కూడా అతనే కనబడుతున్నాడు అనే స్థితికి వచ్చేసింది. అయినా అతడు రాకపోయేసరికి, చందమామ తారలతో కలిసి తనను వెక్కిరిస్తున్నాడని, తన చెలికాడు మాత్రం తన దగ్గరికి ఇంకా రాలేదని వాపోయింది.

తిశ్ర గతి(రదీఫ్ : చెలికాడా)
రచన : చంద్రకళ

నీకోసం అభిసారికగ
వేచానులె చెలికాడా
నారాజా రావేమని
వెతికానులె చెలికాడా
ఏటికాడ తానమాడి
కొత్తచీర  కట్టినాను
గాజులేసి వంకిపెట్టి
వచ్చానులెచెలికాడా
బొట్టె పెట్టి కాటుకెట్టి
గుళ్ళోనా దీపమెడితి
పూలెట్టీ  హారతులే
ఇచ్చానులె చెలికాడా
మాపటేళ మాయదారి
చలికాయగ రావేలా
దీపంలోనిన్నుచూసి
మెచ్చునులే చెలికాడా
చందమామ తారలతో
మేలమాడి వెక్కిరించె
తోడురార  చక్కనోడ
పిలిచానులె చెలికాడా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!