మహిళాసాధికారత

మహిళాసాధికారత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:పి.ని.వి.యన్.రాజకుమారి

సృష్టి లోన వింతలెన్నో చూడరా
ఆడపిల్ల అద్భుతము సోదరా || సృష్టి ||

ఓర్పు తోడ మురిపించెడి అమ్మరా
తోడు నీడ ఉండేటి భార్యరా ||2||

సహనముతో ప్రేమనే పంచురా
త్యాగానికి మరో రూపు ఆమెరా ||సృష్టి||

తోడబుట్టి ఇంట వెలిగే చెల్లిరా
సేవచేసి సాయమిచ్చు చెలిమిరా||2||

అనునిత్యము తోడుండే శక్తి రా
సృష్టికి ప్రతిసృష్టి చేయు బ్రహ్మరా||సృష్టి||

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!