జాతీయ పక్షి-నెమలి(బాల పంచపది)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: శ్రీ సుధ కొలచన
కరిమబ్బు చూసి మురిసె నేను,
నాట్యమునే చేయగలను నేను,
పురివిప్పి ఆడే నెమలిని నేను,
ఎన్నెన్నో వర్ణాల రూపము నేను,
భారత జాతీయ పక్షిని నేను సుధా!!
వేల కనులున్న ఇంద్రుడు నేను,
నేల పైన ఇంద్రధనువు నేను,
కవీంద్రుడి చేతి కలము నేను,
ఇంద్రనీలపు వర్ణ రాజం నేను,
ఇష్నుని మకుట పింఛము నేను సుధా!