చదువు

చదువు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:పి.వి.వి.యన్.రాజుమారి

జ్ఞానము తెలివిని కూర్చునది
సత్యమసత్యము తెలుపునది
సద్గుణములనే పెంచునది
విద్యకు సాటి ఏమున్నది||2||
పూర్వపు గురువులు పంచెనుగా
వేద పురాణ శాస్త్రములూ
పెంచెను మనిషిలొ సత్వమును
మార్గము చూపెను మోక్షమునకు||జ్ఞా||
కాలపు తీరులు మారెనుగా
స్వార్ధము జనులలో ప్రబలెనుగా
నీతి నియమములూ కలయేగా
విద్యల తీరుయె మారెనుగా||జ్ఞా||
విద్యయె వ్యాపార మాయెనుగ
పిల్లల భవితయే శూన్యముగ
సాగును చదువుల స్థితి నేడు
మార్చుట ఎవరి తరమగును||జ్ఞా||

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!