కఠిన ప్రేమ

కఠిన ప్రేమ

రచయిత ::పి. వి. యన్. కృష్ణవేణి

మేడం,  ఈ బాబు మీ క్లాసులో కూర్చుంటాడట, మీ క్లాస్ కావాలని ఏడుస్తున్నాడు.  అంటూ ఒక బాబుని తీసుకొని వచ్చింది ఆయమ్మ.

అవునా!!!! ఎందుకు అలా ఏడుస్తున్నావు! ఇంతకీ నీ పేరు ఏమిటి???  అన్నాను వాడిని బుజ్జగిస్తూ.

ఆ అలా వాడిని కూడా బుజ్జగిస్తూ,  గారం చేసే టీచర్ కావాలంట వాడికి,  అందులో ఈ క్లాసులోకి వస్తే చక్కగా అల్లరి చేయొచ్చు,  గారంగా చూసుకుంటారని ఇటు వైపు రావడానికి మొగ్గు చూపెడుతున్నారు మా క్లాసులో వాళ్ళందరూ కూడా.  అక్కడికే  అందరినీ పంపిస్తాను అంటూ తన అక్కసును వెళ్ల బొసుకుంది  మా కొలీగ్ శిరీష.

టీచర్ అన్న తర్వాత చదువు చెప్పకుండా,  మందలించకుండా,  శిక్షించకుండా ఎవరు ఉంటారు?  గారం చేయడమేంటి అంటూ కోపంగా అనేసి నా క్లాస్ లోకి వచ్చేసి,  నా పనిలో నేను లీనమైపోయి ఉన్నాను.

మిస్,  మౌనిక మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ
వచ్చింది ఆయమ్మ.

ఏంటి మేడం అంటూ బయటకు వచ్చాను.

ఎందుకు మేడమ్,  మీ పిల్లలను అలా భయ పెడుతున్నారు?  వర్క్ చేయకపోతే కొడతానన్నారుట కదా అంటూ అడిగారు మా పిల్లలకు క్లాస్ టీచర్ గా ఉండే మౌనిక మేడం.

అవును కదా మేడం,  ఈ సంవత్సరం అసలే అంతంత మాత్రం చదువులు.  ఈ కరోనా పుణ్యమా అని దారిలో పడుతున్నారనుకున్న చిన్నపిల్లల కాస్తా, ఉన్నవి కూడా మరిచిపోయారు   ఆ మాత్రం భయపెట్టకపోతే వచ్చే సంవత్సరానికి ఎందుకు పనికి రారు కదా అన్నాను బాధగా.

ఇంతలో శిరీష మేడం కలాగ చేసుకుంటూ,  గారాబం చేసుకుంటూ పోతే,  పిల్లలు అందరూ అలాగే ఉంటారు లెండి అంటూ తన ఆక్కసును వెళ్లగక్కింది మరొకసారి.

సర్లే, ఈ మేడం గారాబం చేస్తారా!!! అందులో చదువు విషయంలో. అస్సలు చేయరు.  అందులోనూ వీళ్ళ పిల్లలు ఇద్దరికీ కూడా ఈ మేడం అంటే చాలా భయం తెలుసా…  ఏదైనా  పొరపాటు గురించి, మీ అమ్మకు  చెప్తాను అంటే చాలు, చాలా భయ పడతారు పిల్లలు  ఇద్దరూ కూడా.

అంతే కాదు ఆవిడ తీసుకునే కేర్ కూడా,  పిల్లల గురించి పట్టించుకునే తీరు కూడా బాగా ఉంటుంది అంటూ మెచ్చుకున్నారు మౌనిక మేడం.

తల్లిగా నాకే తెలియని నాలో ఉన్న ఓ కొత్త కోణం ఆరోజు నాకు పరిచయం చేశారు.  నాలో ఉన్న కొత్త కోణం కూడా అదీ స్కూల్ లో గాని,  ఇంట్లో గాని ఎక్కడైనా నేను పిల్లల్ని మంచిగానే చూస్తానన్న పేరు.  కానీ ఇంత స్ట్రిక్ట్ గా ఉంటానని నాకైతే తెలియదు.

చిన్న పిల్లలకు చదువు ముఖ్యం.  ఆ చదువుతోనే ఒక ప్రణాళిక వాళ్ళకి ఏర్పాటు అవుతుంది.  అది వాళ్ళు చదివే తీరుని బట్టీ వాళ్ల దినచర్యను కూడా ఏర్పాటు చేశాను.  ఈ కరోనా సెలవులలో వాళ్ల లోని కొత్త కోణం వెలుపలకు తీసాను.

వాళ్ల చేత బొమ్మలు గీయించడం,  మొక్కల పెంపకం,  చిన్నచిన్నగా ఇంటి పనులలో నాకు సహాయం అందించడం, కంప్యూటర్ నేర్చుకోవడంలో శిక్షణ,  వాళ్ళ ఉన్నత చదువుల రీత్యా వాళ్ళకు ఉపయోగపడే అంశాలు,  ఇలా చాలా రకాల సందేహాలు, వాళ్ళ ఖాళీ టైంను వాళ్ళ ఉన్నతిని వినియోగించాను.

కానీ, వాళ్లు ఎక్కువ సమయం ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల,  వాళ్ళని తప్పని పరిస్థితుల్లో కొన్ని సంఘటనల వల్ల, కొన్ని పరిస్థితుల దృష్ట్యా, పిల్లలు ఇద్దరిని బయటకి వెళ్లి ఆడుకునే అవకాశం ఇవ్వకుండా,  కొంత కఠినంగానే వ్యవహరించాను.

భవిష్యత్తులో బాధపడకూడదు అనే ఉద్దేశ్యంతో ఇంట్లో ఉన్నా కూడా, స్కూల్ వాతావరణం లాగే ఏ రోజు వర్క్ఆ రోజే పూర్తి చేయించాను.  అది తెలిసిన మౌనిక మేడం, పిల్లలను అభినందనించారు. అలాగే చాలా సంతోషించారు.

అమ్మ మా ఫ్రెండ్స్ ఎవరు అంతసేపు వర్క్ చేయట్లేదమ్మ… అమ్మ …అంటూ మారం చేసిన రోజులు కూడా ఉన్నాయి.

కానీ వాళ్ల శ్రేయస్సు కోసమే నేను ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నాను అని ఆ చిన్న మనసులకు అర్థం అవుతోంది ఇప్పుడు ఇప్పుడే.

అలాగే నా క్లాస్ లో  ఉన్న ఆ చిన్న పిల్లలకు కూడా నా వంతు కృషిగా నేను చేయదలుచుకున్న సాయం చేయగలిగినంత అందించాను.

ఎందుకంటే నేను అదృష్టాన్ని నమ్ముకుని ఉన్న మనిషిని కాదు.

కష్టం చెయ్యి, ఫలితం పొందు అన్నది నా సిద్ధాంతం. ఎవరు ఏమి అనుకున్న సరే!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!