పరివర్తన

పరివర్తన

రచయిత ::అశ్విని ‘సంకేత్’

సుమతి,శ్రీరామ్ లు చక్కనైన జంట అని ఆ వీధిలో అందరూ అనే మాట.నిజంగానే వారు ఇరువురూ ఒక్క మాటపై వుంటూ తమ చిన్న సంసారాన్ని సజావుగా సాగిస్తున్నారు.వారికి ఇద్దరు కొడుకులు…చంటి,బంటి. ఇద్దరూ కూడా చక్కగా చదువుకుంటూ తల్లి తండ్రుల మాట జవదాటే వారు కాదు.

శ్రీరామ్ స్టీల్ ప్లాంట్ లో రోజు వారీ ఉద్యోగి.తను తెచ్చే జీతంతోనే ఇల్లు గడిచేది.సుమతి భర్త తెచ్చిన జీతాన్ని సవ్యంగా ఉపయోగిస్తూ ఇట్లో అవసరాలను బట్టి పొదుపుగా వాడుతూ వుండేది.

అన్ని రోజులు ఒకేలా వుండవు.అలానే ఒక రోజు శ్రీరామ్ చేతులు అనుకోకుండా మిషన్ లో పడి నుజ్జు నుజ్జు అయిపోతాయి.

ఫ్యాక్టరీ వాళ్ళు తను పర్మినెంట్ ఉద్యోగి కాకపోవడంతో తన హాస్పిటల్ బిల్ లో సగం మాత్రమే పే చేస్తారు.అలాగే శ్రీరామ్ కి ఆర్థిక సహాయం నిమిత్తం కొంచం డబ్బులు మాత్రమే ఇచ్చి,చేతులు దులుపు కుంటారు.

సుమతి కొన్ని రోజులుగా కడుతున్న చీటీ పాటనీ పాడి భర్తకు వైద్యం చేయిస్తుంది. శ్రీరాముకు ఇప్పుడు రెండు చేతులు లేవు.ఇంటి పట్టునే వుండే దౌర్భాగ్యం కలిగింది.

శ్రీరామ్ శారీరకంగా కొలుకున్నా,మానసికంగా కొలుకో లేక పోయాడు.కారణం,ఇంట్లో పెరుగుతున్న కర్చులూ మరియు తన అంగవైకల్యం.

కానీ,…సుమతి,శ్రీరామ్ కి వెన్నంటే వుంటూ ధైర్యం నూరిపోస్థూ వుండేది.అయినా,శ్రీరామ్ మామూలు మనిషి కాలేక పోయాడు.

ఇంట్లో కర్చుకులకి డబ్బులు కూడా లేని పరిస్థితి అయ్యింది.అప్పుడు సుమతి భర్త హాస్పిటల్ బిల్ కి అవ్వగా మిగిలిన డబ్బులతో,ఒక కుట్టు మిషన్ కొనుక్కుని.

చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న కుట్టు పనిని నేడు జీవనాధారం కోసం ఉపయోగించుకుని.దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఇంటి వద్దే ఉదయం పూట ఇడ్లీ వ్యాపారం,సాయత్రం పూట బజ్జీల వ్యాపారం చేస్తూ నాలుగు రాళ్లు సంపాదించటం మొదలు పెట్టింది.

అంతే కాకుండా తనకి వచ్చిన కుట్టు పనిని నలుగురికి నేర్పుతూ కూడా డబ్బునీ సంపాదిస్తుంది.

కొన్ని రోజులలోనే, తన భర్త చదువు మీద లోన్ పెట్టీ.. ఇంటికి దగ్గరలో చిన్న బడ్డీ కొట్టు కూడా ఓపెన్ చేసి భర్త నీ అందులో కూర్చో పెట్టీ..అతని మానిసిక బాధని కూడా తగ్గించింది..

ఇంతలో తన చిన్న నాటి స్నేహితురాలు వసుమతి,సుమతి ఇంటికి వస్తుంది.

వసుమతికి ఈ మధ్యే భర్త చనిపోయాడు.వసుమతి భర్త తాగు బోతూ,తిరుగు బోతూ ఒక రోజు తాగి,చూసుకోకుండా రోడ్డు దాటుతుండగా ఒక లారీ గుద్దడం తో చనిపోయాడు.అప్పటి నుండి ఎన్ని సార్లు సుమతి,వసుమతినీ కలుద్దాం అనుకున్నా తన ఇంటి పనుల వల్ల వీలు లేక కలవడం అవ్వలేదు.

ఈ రోజు వసుమతే తన ఇంటికి వచ్చింది. ఇద్దరూ చాలా రోజుల తర్వాత కలిసినందుకు చాలా సంతోషించారు.

సుమతికి,వసుమతిలో భర్త పోయాడు అనే బాధ ఏ మాత్రం కానరాలేదు ,సరికదా వసుమతిలో ఏదో తేడా కూడా వచ్చినట్టు అనిపించసాగింది.

మాటల మధ్యలో సుమతి,వసుమతినీ మరి ఇప్పుడు ఎలా?? నీ జీవనం సాగిస్తున్నావు!! అని అడుగుతుంది.

దానికి వసుమతి నవ్వుతూ నాకేమీ నేను చాలా మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాను.పెద్ద ఇల్లు,చిన్న కారు,విలాసవంతమైన జీవితం అంటుంది.మంచం పై వెనక్కి వాలి.

సుమతి ఎలా?? అంటుంది.

వసుమతి,ఎలా ఏముంది.భర్త చనిపోయిన ఆడది అంటే అందరికీ లోకువే,ప్రతి మగాడి కళ్ళు తన మీదే అదే నేను యూజ్ చేసుకుంటున్నా అంటుంది.

సుమతి, చీ..నువ్వు చేసేది నీచం కాదా!! అంటుంది.

వసుమతి నవ్వుతూ ముందు నేను అలానే అనుకున్నా.కానీ నా భర్త చనిపోయినప్పుడు నుండి నా అన్నవాల్లు,నా చుట్టూ వుండే వాళ్ళు నన్ను లొంగ దీసుకొడానికి సర్వ ప్రయత్నాలు చేశారు.

వాటికి నాకు చనిపోవాలని అనిపించింది కూడా..కానీ నేను ఎందుకు చనిపోవాలని, ఈ సమాజం నాకు చూపే దారి ఇదేనేమో?? అనుకుని,నాకు కనిపించిన దారిలో వెళ్ళాను అంటూ బోరున ఏడుస్తుంది.

సుమతి,ఏడుస్తున్న స్నేహితురాలిని అక్కున చేర్చుకుని.. ఏడ్వకు బలహీనమైన స్త్రీ అంటే ఈ సమాజం అలానే చూస్తుంది.

కానీ,మనమే మన బలహీనతను,మన బలంగా మార్చుకుని జీవితంలో అడుగు ముందుకు వెయ్యాలి.. ఆ ,అడుగు అనేది మన జీవితాన్ని ముందుకు నడపాలి కానీ,వెనక్కీ నెట్టకూడదు అంటూ.

నాకూ, నీ లాగే చాలా జరిగాయి.శ్రీ రామ్ కి ఒంట్లో బాలేక పోవడంతో అతన్ని పలకరించటానికి వచ్చిన వారిలో, కొందరు నన్ను డబ్బు ఆశ చూపి లొంగ దీసుకోవాలి అనుకున్నారు.

ఏదో ఒక వంక తో నన్ను తాకాలి అని చూసిన వారే..శ్రీ రామ్ అవికి తనాన్ని చూపి నాకు ఓ దారి చూపిస్తాను అన్న మహనుబావులు!! లేక పోలేదు.

ఈ సమాజం ఇలా వుంటుందా!! అని అప్పుడు నాకు తెలిసింది..మనం కష్టాల్లో వున్నప్పుడు మన మెదడు పని చెయ్యదు.అప్పుడే మన మనస్సు చెప్పినట్టు మన స్వాభిమానాన్ని కోల్పోకుండా నిర్ణయాలు తీసుకోవాలి.

నేను అలాగే తీసుకున్నా.దాని వలన ఈ కొద్ది రోజుల లోనే, జీవితానికి సరిపడా కష్టాలను పడ్డాను.

సమాజంలో తప్పు!! ఒప్పు!! రెండూ ఉంటాయి. ఆ రెంటికీ ఒకదాన్ని ఎంచుకోవడం.అది మన చేతుల్లో వుంటుంది.

ఒప్పుని ఎంచుకొన్నపుడు బాధలు కల్గినా, అవి కొంత కాలమే.అలాంటి బాధలను తట్టుకున్నప్పుడే మనిషి జీవితం సార్థకత అవుతుంది.

అందుకే…ఎన్ని జరిగినా,ఏమి జరిగినా,నా స్వభిమానాన్ని నేను వదలక పోవడం వల్ల సమాజంలో నాకంటూ మంచి గుర్తింపు దక్కింది.

అందరికీ అలా అవ్వదు నేను ఒప్పుకుంటాను. కానీ,ఒక తప్పు చేయడం సులువు.ఆ తప్పు సరిదిద్దుకోవటం చాలా కష్టం.అందునా తప్పు దిద్దుకునే అవకాశం కూడా అందరికీ రాదు.

కానీ,ఇప్పుడు…నీకు, నీ తప్పు దిద్దుకునే అవకాశం ఇంకా వుంది.నీవు ఈ పాపపు పని మాని ,చక్కగా జీవించు! అంటుంది సుమతి.

బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు వసుమతికి ,సుమతి మాటలతో జ్ఞానోదయం అయి ఒక నిర్ణయం తీసుకున్న దానిలా ,ఇంటికి వెళ్తుంది.

కొన్ని రోజుల లోనే వసుమతి తన నీచపు జీవితాన్ని వదిలేసి.ఒక NGO లో జాయిన్ అయి,తన లాంటి భర్త నీ పోగొట్టుకున్న ఆడవారికి, సమాజంలో ఎలా?? బతకాలో నేర్పుతూ చాలా మంది ఆడవారి జీవితాలకు చుక్కాని అయ్యింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!