మహిళ అంతరంగాలు

మహిళ అంతరంగాలు
                 (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)          

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

    సూర్యోదయం తో పాటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అంతగిన్నే  తోమే మహిళ సెలవు ప్రకటించింది. కాలింగ్ బెల్ కోకిల గానంతో పాల ప్యాకెట్ పుచ్చుకుని కాఫీ కలిపి గిన్నె స్టౌపై ఉంచింది.
ఈ లోగా గుమ్మంలో పెద్ద ముగ్గు పెట్టీ లోపలికి వచ్చింది. ఇల్లు గబ గబ తుడిచి పినాల్ చల్లి తడి బట్ట పెట్టింది. ఇల్లంతా ముగ్గులు చిన్నవి పెట్టీ
ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ పెట్టింది. ఈ లోగా స్నానం చేసి వచ్చి దేముడు పూజ చేసి కొబ్బరి కాయ కొట్టి నైవేద్యం పెట్టింది. ఈలోగా కూతురు సౌమ్య వచ్చి అమ్మ అమ్మకి సెలవు ఉండదు సరికదా  సెలవు రోజు పని ఎక్కువ ఉంటుంది. రమణి పేరున్న సంఘ్ సేవలో అరి తీరింది చిన్నప్పటీ నుంచి పెద్దల కూడా ఉండి మాట సహాయం పనిలో నేర్పు అన్ని తెలుసుకుని ఉన్నది. తండ్రి తల్లి ఇద్దరు లెక్చరర్స్ చేసి రిటైర్ అయ్యారు  పెన్షన్ వస్తుంది దానితో వాళ్ళు ప్రశాంత జీవితం గడుపుతున్నారు కొడుకు డాక్టర్ కూతురు ఇంజినీర్ చదువుతొంది ఇప్పుడు అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్లో తల్లి వెనుక సేవ చేస్తూ ఉంటుంది. రమణి చాలా పొందిక అయిన మనిషి. అతిథి అభ్యగతి ఆత్మీయత ఆదరణ వంటివి ఉన్నాయి. ఈ రోజు మహిళ దినోత్సవం సందర్భంగా ఒక సంస్థ వారు సన్మానం చేస్తాము అన్నారు
నాకు వద్దు అన్నది కానీ వాళ్ళు ఊరుకో లేదు భర్త రావ్ కి చెప్పివప్పించ మాన్నారు. ఇంకా భర్త మాట జవదాటని ఆధునిక పతివ్రత సీత దేవి ప్రతి రూపము రమణి వప్పుకొక తప్ప లేదు మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు అప్పటికి సౌమ్య ఇంట్లో ఉన్నది కనుక సగం పని అమె చేస్తోంది. తల్లి అంటే ఆడపిల్లకి ఎంతో అభిమానం ఉంటుంది. కానీ రమణి పిల్లను శ్రమ పెట్టడం ఇష్టత లేదు వద్దు వద్దు అంటుంది కని తండ్రి రావ్ కూతురు సౌమ్య ఎదో రకంగా సహాయం చేస్తూనే ఉంటారు. అమ్మ నువ్వు మీటింగ్ కి వెళ్ళాలి కదా రెడీ అవ్వు వంట పని నేను చూస్తాను అన్నది. వద్దు నువ్వు మహిళ వే కదా అందుకు నువ్వు పని చెయ్యి వద్దు అన్నది, సరే నాన్న గారు నువ్వు కూడా మీ అమ్మతో మీటింగ్ కు వెడదాము అన్నాడు సరే మనం రెడీ అవుదాం అన్నాడు. ఇద్దరు రెడీ అయ్యారు కూతురు టేబుల్ పై పళ్ళాలు గ్లాసులు పెట్టీ కారం పొడి రెఢీ చేసింది.
సరే కొబ్బరి తురిమి పచ్చడి చేసి రమణి తెచ్చింది.
ఈలోగా రావ్ పిండి వడియాలు వేయించి తెచ్చాడు
రాత్రి తెచ్చిన కరాచి షాపు నుంచి స్వీట్  తెచ్చాడు
అన్ని టేబుల్ పై పెట్టారు. రమణి ఇడ్లీ కుక్కటు విప్పి ఇడ్లీలు సర్ధి కొబ్బరి  చట్నీ కారం పొడి వేసి నెయ్యి కాచి వేసి పిండి వడియాలు వేసి స్వీట్ వేసి తిన్నారు మరి రెండు ఎక్కువ తినాలి నువ్వు ఉప న్యాసం ఇవ్వాలి అని చెప్పాడు రమణి నవ్వు కున్నది
ఈ రోజు నాకు ఇది కొత్త కాదు కదా ఎందుకు అంతా టెన్షన్ పెడతారు తండ్రి కూతురు అన్నది. అబ్బే ఇదేమి పద్మ విభూషణ్ పద్మ భూషణ్ కాదు , ఎదో మహిళల సమస్యలు చర్చించుకునే సభ, ఎదో ఇది చిన్న సభ పెద్ద సంస్థలు కాదు అన్నది సరే ఎది అయిన సభ కదా అన్నారు, అందరూ రెడీ అయ్యి తల్లి కూతురు ఒక స్కూటర్ పై వెళ్లారు ఓ గంట తరువాత నేను వస్తాను అన్నాడు రావ్ సరే అని బయలు దేరారు వంట నేను వచ్చి వండి పెడతాను మీరు ఎవరు వర్రీ కావద్దు అన్నది. సరే అన్నాడు  వాళ్ళు వెళ్లారు ఈ లోగా రావ్ ఆలోచించాడు ఈ రోజు కూతుర్ని భార్యను సర్ప్రైజ్ చెయ్యాలని అనుకున్నాడు. ఒక కుక్కర్లో  గిన్నెల్లో టమేటా మీల్ మేకర్ వేసి ఉంచాడు. రెండవ గిన్నెలో  కుక్కర్లో మామిడి కాయ ముక్కలు పప్పు వేశాడు మూడవ గిన్నెలో చింత పండు బెల్లం సాంబారు పొడి వేసి కొత్తిమీర వేసి కుక్కర్ పెట్టాడు. రెండువ కుక్కర్ ఎలక్ట్రికల్ దానిలో రాగంగానే బియ్యం పోసి నీరు పోసి పెట్టాడు. మీటింగ్ అయ్య టైమ్ కి వెళ్ళాడు రమణి ప్రో స్తాహిస్తున్న భర్తకి కూడా వారు స్టేజ్ మీదకు పిలిచి సన్మానం చేశారు ఆదర్శపతి గా గుర్తింపు వచ్చింది. రావ్ మంచి వాడే కాక భార్య పిల్లలని ఎంతో ప్రేమ ఆదరణ ఆత్మీయంగా అభిమానంగా చూస్తాడు. ఆడపిల్లల్ని ఆరోగ్యంగా ధైర్యంగా పెంచాలి అని చెపుతూ ఉంటాడు
భర్త అన్ని ఏర్పరచి  పిల్లలను ఎంతో బాగా పెంచాడు అంతే కాకుండా విద్యార్థులకి కూడా మనో నిబ్బర ము ఏర్పరచాడు. కాలేజి లో కూడా భార్య భర్త మంచి పేరు తెచ్చుకున్నారు మీటింగ్ అయ్యే సరికి రెండు గంటకు అయ్యింది ఇప్పుడు ఇంటికి వెళ్లి వంట ఏమి చేస్తావు ? మనం హోటల్ కి వెడదాం అబ్బడు  సౌమ్య కూడా సరే అన్నది కానీ రమణి మాత్రం వద్దు అన్నం ఎంత సేపు కుక్కర్లో వందు తాను .నడవండి అంటూ స్కూటర్ వైపు వెళ్ళింది
ఆ మీటింగ్ చర్చ ఇంతల అయ్యాక ఇంటికి వెళ్ళాక ఆడవాళ్ళకి చిన్న పిల్లలుంటే వాళ్ళు బిత్తర చూపులతో ఎదురు వచ్చి కాళ్ళకి చుట్టుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్లి ఇంటి పనులు లో చేరిపో వాలి అంటారు అక్కడ అంతా నిజమే ఉపన్యాసం వేరు జీవితం వేరు అది తెలుసుకుని బ్రతకాలి
నానాటీ బ్రతుకు నాటకము అన్న శ్రీ అనమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారాంశం తెలుసుకుని ఎవరి జీవిత సరళిని బట్టి వారు జీవించాలి కదా.
సరే హైటెక్ సిటీ కదా హోటల్ కి వెళ్లి ఈ రోజు మేడం  వంటకి సెలవు ఇద్దాము అన్నాడు. వద్దు వద్దు అన్నది, ఏమిటి నీ చాదస్తం అనుకున్నారు.
స్కూటర్ లు ఇంటి ముందు అగాయి దండలు శాలువా గిఫ్ట్స్ మొక్కలు కుండీలు బో కెలుగా ఇచ్చారు, అవన్నీ తెచ్చి హాల్లో పెట్టీ కొంగు దోపి వంటింటి వైపు వెళ్ళింది. రమణి మేడం మీరు ఖంగారు పడవద్దు ఒక్క క్షణం రెస్ట్తీసుకోండి. అంటూ మంచినీళ్లు ఇచ్చాడు సౌమ్య నవ్వుతోంది
ఏమిటి ? నన్ను మీరు ఆట పట్టిస్తున్నారు అన్నది
ఈలోగా చేతులు కడుగు కుని వంటింటికి వెళ్ళింది కుక్కర్  గ్యాస్ పై ఉన్నాధి కూల్ అయివున్నది
వెంటనే విడదీసి పోపులు వేసింది. ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నం రెడీ రావ్ కంచాలు పెట్టీ కూతురుకి భార్య కు ప్రేమగా వడ్డన చేశాడు ఒక రోజు అయిన సదా సేవలో అంటూ నవ్వాడు, తల్లి కూతురు ఎంతో సంతోష్ పడి మీకు  నాన్న అని కంచంలో వడ్డించారు. కుటుంబంలో ఆదరణ ఉంటేనే సుఖం అంటన్న భార్య  మాటలు కూడా నిజమే భర్త, అన్న , తండ్రి , తమ్ముడు, కొడుకు ఇలా ఇన్ని రూపాలలో కుటుంబ సభ్యులు మరియు భవంతుడు మన చుట్టూ స్నేహితులను మంచి వాళ్ళను ఇచ్చి వీరు” వైపే” మాదిరి స్త్రీకి రక్షణ కవచంలా ప్రేమ అందిస్తేనే కదా స్త్రీకి ప్రగతి కీర్తి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!