నాలో నేను

నాలో నేను

రచయిత :: ఎన్.ధన లక్ష్మి

కన్నీరు  వెనకే కాదు
చిరునవ్వుల వెనుక
కూడా ఎన్నో బాధలు ఉంటాయి
కన్నీరు ఒక సారి అబద్ధం  చెప్పవచ్చు అలాగే…
చిరునవ్వు చాలాసార్లు అబద్ధం చెపుతుంది
ఎన్నో బాధలను బరువులను దాచేసి
నేను సంతోషంగా ఉన్నాను అంటూ
తన వారిని నవ్విస్తుంది ..
స్వచ్ఛమైన చిరునవ్వు
అంతులేని ఆనందం
కాగితం పడవలతోనే వెళ్లిపోయాయి ..
మిగిలింది అంత
రేపటి గురించి ఆశ
నిన్నటి గురించి బాధ
నేటి గురించి ఆలోచన
రేపటి గురించి ఆశ వద్దు
నిన్నటి గురించి ఆలోచన అసలే వద్దు అంటూ ……
ఏకాంతాన్ని ఇష్టపడ్డాను
నా ఒంటరితనాన్ని దూరం చేస్తుందని
కాలంతోస్నేహం చేశాను
ప్రతిక్షణం తోడుగా ఉంటుందని ..
భవిష్యతుకు ప్రేమ పంచాను
అది నా జీవిత గమ్యానికి దారి చూపుతుందని
కన్నీళ్లకు  ధెర్యాన్ని  నేర్పాను
ఓటమి కూడా నాకు దాసోహం అవుతుందని
ఇవన్నీ జరగాలంటే ముందు
నేను నాలా ఉండాలి
నన్ను నేను ఇష్టపడాలి అని తెలుసుకులేక పోయాను !!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!