బామ్మ గారి ఆవకాయజాడి

బామ్మ గారి ఆవకాయజాడి

రచన: దోసపాటి వెంకటరామచంద్ర రావు

అఖిలాండేశ్వరి అంటే ఆ వీధిలో వారికి హడల్. ఆమె వీధి గుమ్మంలో కూర్చొని వుందంటే అటునుంచి ఇటునుంచి వచ్చేవాళ్ళు దూరంనుంచి చూసి వెనక్కి
వెళ్ళిపోయేవారు.ఆవిడ వాగ్ధాటికి వేసే ప్రశ్నలకి జవాబులు చెప్పలేక బిక్కచచ్చిపోయేవారు.వీధీలోకి అడామగా ఎవరైనా సరే ఆవిడ లేని సమయం చూసుకొని బయల్దేరేవారు.
అఖిలాండేశ్వరి అంతటి ప్రజ్ఞావంతురాలు కావడానికి కారణం ఆవిడ తండ్రి గెజిటెడ్ హోదాగల తాహశిల్దారు గారు.వాళ్ళ అమ్మగారు కూడా ఒ గెజిటెడ్ హోదాగల తాహశిల్దారు గారింటినుంచి వచ్చినదే.ఇక ఆవిడ అత్తింటి వారు కూడా గెజిటెడ్ హోదాగల తాహశిల్దారు గారే.ఇక నేను ఏమి చెప్పక్కర్లేదను కుంటాను ఆవిడ ఆ ధాటికి గల కారణాలు.ఇంటికి వచ్చే ఆఫిసు ప్యూన్లు చేత అడ్డమైన పనులు చేయించకోనేది.వాళ్లాయన ఎంత చెప్పినా వినిపించుకునేదికాదు.కొడుకు కోడలు వచ్చాక కూడా ఆవిడ జోరు తగ్గేదికాదు.”నీకు తెలిదమ్మాయ్!నువ్వింత మెత్తగా వుంటే సంసారంలో నెగ్గుకు రాలేవు సుమా.లైక్యం తెలియని దానివి ఎలా బ్రతుకుతావో ఏమిటో”అంటూ హడల్ గొట్టేది.

ఆరోజు ఎప్పటిలా పనిమనిషి రంగి లేటుగా వచ్చిందని ఇక ఆవిడ ధొరణి ఆరంబించింది.”ఓసేయ్ రంగి!ఏమిటే నిన్నరాత్రి నువ్వు మొగుడు కలిసి సెకండుషో సినిమాలు టివీలో చూస్తూండిపోయారా.ఇంత వేగంగా వచ్చేశావ్.”ఆంటూ దాని వెంట వెంట తిరిగి పనిచేయించేది.మధ్య మధ్యలో జోకులు కూడా వేస్తుండేది.”ఎన్నో నెలే అలా బరువుగా అడుగులు వేస్తున్నావ్.నీకు మెటర్నిటి లీవు ఇప్పించేయాల్సిందే” అంటూ పరుగులు పెట్టించేది.

కొన్నాళ్ళు కొడుకుకోడలు దూరంగాఉత్తరభారతదేశంలో ఉన్న మనవడి దగ్గరకు వెళితే తనకూడా వాళ్ళతో వెళ్ళింది.అక్కడ వాళ్ళున్నది నెలరోజులె అయినా అక్కడ ఆవకాయ పెడతానంటు జాడీలు కొనమంది.ఆవకాయ వద్దు జాడీలు వద్దు బుద్దిగా కూర్చోని కబుర్లు చెప్పుచాలు.మాకు.ప్రియా కంపెని రుచి కంపెని వాళ్ళు తయారుచేసినవి దొరుకుతాయిలే అని మనవడు ససేమిరా వద్దన్నాడు.ఆవిడెవరు అఖిలాండేశ్వరి కదా ఊరుకుంటుందా”అపురా బడవాయ్ చక్కగా ఇంట్లో పెట్టిన ఆవకాయకి సాటేమిటిరా. ప్రియాలేదు రుచీలేదు.ఓ మూడు డజన్లకాయలు ఒ పెద్ద జాడి మూతతో సహ కొనుక్కొచ్చేయ్.అలా ఆవకాయ చేసి పడేస్తాను.వచ్చేసంవత్సరం వరకు నన్ను తలచుకొంటూ తిందురుగాని.నీకు వీలుకాకపోతే చెప్పు నేను మనవరాలు కలసి కొనుక్కొస్తాం”అంటు బాంబుపేల్చింది.ఇక తేవక చస్తాడా.వాళ్ళకే కాదు
ఆ కలనీ వాళ్ళందరిచేత ఆవకాయ చెయ్యడం ఎలాగో నేర్పించి మరీ పెట్టించేసింది.
ఇక బామ్మగారి ఆవకాయజాడిగురించి తెలుసుకుందాం.అత్తారింటికి వచ్చెటప్పుడు సారేతోపాటు ఓ ఆరురకాల ఆవకాయలు ఆరుజాడిలలో పెట్టించుకొని పట్టుకొచ్చింది.అదే తంతు ప్రతిసంవత్సరం కొనసాగిస్తూ వచ్చేది.మనవలు మనవరాల్లు ఆడుతూపాడుతూ ఆరుజాడిలలో ఒక్కటిమాత్రం మిగిల్చేరు.ఆ ఒక్కజాడీడు ఆవకాయ
పెట్టడానికి అటకమించి రంగిని ఎక్కించి మరీ దింపించడానికి రంగికి పురమాయించింది.అది ఆర్భకురాలు దింపలేక క్రిందజార్చేసింది.ఇంకేముంది అఖిలాండేశ్వరి రంగిని తిట్టినతిట్టు తిట్టకుండా కొపంతో ఊగిపోతు కొట్టబోయింది.ఎగశ్వాసతో ఊపిరాడక కూలబడిపోయింది బామ్మ అఖిలాండేశ్వరి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!