నడుం బిగించండీ!
రచన: ఎం.వి.చంద్ర
సంగీతం ఆపాతమధురమైతే,
సాహిత్యం ఆలోచనామృతం,
కేబుల్ టీవి తుఫానుకు
యువతరంలో సాహిత్య పిపాస అమరపురికి ఏగే,
సెల్ ఫోను వడదెబ్బకు ,
నవతరంలో సంగీతతృష్ణ అడుగంటే,
కవిగాయక పండితులారా,
నడుం బిగించండి,
వాడుకభాషలో వ్రాస్తారో,
లేక వేడుక కలిగిస్తారో,
యువతరంలో సంగీత సాహిత్య ఉత్సాహాన్ని పెంచండి,
పావన నవజీవన బృందావన నిర్మాతలుగా చెయ్యండి,
సాహిత్యమంటే ఆలోచనాలోచనాలని,
సంగీతమంటే మదిని చల్లపరిచే,వెండివెన్నెల
చిందించే, శశి అని తెలియచేయండి!
నడుంబిగించండి, తెలుగు వెలుగులను
ప్రసరించండీ!జీవన మాధుర్యాన్నీ చవిచూపండీ!