తలయెత్తుకున్నతల

తలయెత్తుకున్నతల!

రచన: బి. హెచ్. వి. రమాదేవి

మేజర్! మీరెందుకు నేడు! తలవంచుకు వచ్చారు!?

భరతమాత పౌరుషాన్ని,
రగిలే జ్వలనపు శిఖను!

చూసి తరించే భాగ్యం
కోసం, పాకిస్థానీ ఆర్మీ!

పగలు రేయి కష్టపడి,
సొగసైన తలయెత్తిన,

హేమరాజ్ తల దెచ్చి,
ధన్యత కోసము మోసి,

వారి సైనికులకు భరత
వారియర్స్ పస జూపి!

తలెత్తుకుని తిరిగే తల,
తమవారికి జూపు కొరకు,

నిర్వీర్య సైన్యానికి నేర్పు ,
తలజూపకలుగుమార్పు!

కీర్తి తలగా మొలిచే నేడు!
భర్తీ జేసె శిఖర మై వీడు!

తల నాటిన భూమిలోన,
మొలకెత్తి యు సాధించు!

మరల మరల గుండెజీల్చు,
మొనగాడై చరిత నిల్ల్చు!

ఈ తండ్రి రగులు గుండె,
నందించును వీరజవాన్లు!

శత్రువులను చెండాడు!
మరణాన్నే పెండ్లాడు!

నాదేశం నామాత, నాజాతి
నాజెండా పొగరు నాది!

తగరు శత్రువులు పోటీకి!
తగరు దేశము ఢీ కి!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!