ఒంటరితనాన్ని గెలవాలి

ఒంటరితనాన్ని గెలవాలి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దాకరపుబాబూరావు

ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తూ వెళ్తూ ఇలా ఒంటరి దీవిలో వొదిలి వెళ్ళిపోయింది ఏమిటీ..?
మారుమాటలేవీ ధ్వనించని మౌన ప్రపంచానికి అలా ఎలా తాకట్టు పెట్టి వెళ్తుంది…??
ఎంతకాలం ఈ స్వగతపు నిరీక్షణా ప్రపంచంలోతనకోసం దేవులాడుకోవాలి…?
ఇలా నాలో నేను భాషించుకుంటున్నానంటేతనతో సంభాషించుకుంటున్నాననేగా…?
ఇంతదూరం వుందేమిటీ ఈ ఒంటరితనపు గట్టు?
ఎంత నడచినా దరి చిక్కటం లేదు.?!
నిట్టూర్పుల ఆసరా ఎంతచేసుకున్నా ఒడ్డెక్కేలా లేదు గమ్యం..!!
దాహం ఎక్కువైయ్యే కొద్దీ ఆమె జ్ఞాపకాల చెలం ఎంత గొంతు తడుపుతున్నా ఏదోతెలియని దప్పిక ఇంకా మిగిలే ఉంటోంది…..
శీతాకాలపుచలిలా చుట్టుముట్టే తన ఆలోచన్లసమూహాన్ని ఎలా విదిల్చి కొట్టేది..?
ఎంతకీ వీడని పొగమంచులా కప్పేసినఅయోమయంతో రేవు దాటేదెలా…?
అయినా!ఈ ఒంటరితనాన్ని గెలవడానికి
కాలప్రవాహాన్నిఎలాగైనా ఈదాలి
తనను మళ్ళీ చేరుకోవాలి….!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!