గుండె గూటిలో దాచినవెన్నెన్నో

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

గుండె గూటిలో దాచినవెన్నెన్నో
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : చంద్రకళ. దీకొండ

గుండె గూటిలో…
పొదువుకున్న భావ మధురిమలెన్నో…
దాచుకున్న ఆనందాలెన్నో…
పదిలపరిచిన అనుభవాలెన్నో…
లోనికి నెట్టేసిన ఆవేదనలెన్నో…!
తల్లడిల్లినవేళ సాంత్వన పరుస్తూ…
పన్నీరు చిలకరించే జ్ఞాపకాలెన్నో…
అపురూపంగా తీసి
చూసుకునే స్మృతుల
తీపి తాయిలాలెన్నో…
మరల మరల నెమరువేసుకొనే మధురానుభూతులెన్నెన్నో…!
చేదు సంఘటనల గాయాలు…
అనుకోకుండా ఎదురైన ఆపదలతో…
చెదిరిన గుండె గూటికి
చేసిన మరమ్మత్తులెన్నో…!
మోదమైనా, ఖేదమైనా  స్వీకరించే
గుండె గూటిని…
పదిలంగా కాపాడుకునే ప్రయత్నం
తప్పదుగా మరి…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!