ఋతువులు మారితే

ఋతువులు మారితే
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

ఋతువులు మారితే కాలచక్రం క్రమం తప్పుతుంది
జీవన చక్రం గాడి తప్పుతుంది
ఋతు చక్ర ప్రభావంతో ప్రకృతి వికృతి అవుతుంది
కాల గమనంలో అంతులేనిమార్పులు సంభవిస్తాయి
మానవ జీవనగమనాలు అగమ్యగోచరం అవుతాయి
నిత్య సత్యాలు అసత్యాలుగా మారుతాయి
నిత్యకృత్యాలు అకృత్యాలవుతాయి
శ్రేష్టమైన సృష్టి నిస్చేష్టమవుతుంది
స్పష్టమైన సుస్పష్టమైన జీవనం అస్పష్టమవుతుంది
కష్టాలతోనష్టాలతో అష్టకష్టాలుతో మానవ జీవనం మృగ్యమగును.
ప్రకృతిలో ప్రతీది ప్రశ్నర్ధకం అవుతోంది
జగతి గతి తప్పుతాది
ఏదైనా సమపాళ్లలో ఉంటే సరిగ్గా ఉంటేనే జీవనం జీవితం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!