అజమాయిషి

అజమాయిషి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత.పి.వి.ఎల్

వివేకంతో మెలుగుతున్నావనే భ్రమలో..
అవివేకానికి కొమ్ముకాస్తున్నావు
రాజకీయ ఎత్తుగడలు వేస్తూ..
అడ్డదారులననుసరిస్తూ
ఆడంబరంగా వెలగాలనే కాంక్షతో
అడ్డొచ్చిన వారినందరినీ అమానుషంగా తొక్కేస్తూ
శుష్క ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నావ్
అవకాశవాద శిష్యత్వం
హితవాద గురుత్వం ఏదో ఒకనాడు తెలుసుకోక తప్పదు..
పేరు చివర్న తోక ఊపుతూ
పేదవాని సంపద దోచుకు
తింటున్నావు
ఆధిపత్య సింహాసనంపై కూర్చుని..
అజమాయిషీ చేస్తున్నావు..
పగలు పొగలుకక్కే విజ్ఞాన భానుడు
రాత్రి అజ్ఞాతవాసం చేస్తున్నాడని గుర్తించి మసలుకో
ప్రతి దేహం లోపల
జ్వాలా జ్వలిత కణిక రగులుతూనే ఉంటుందని మరువకు
సమహిత పాలన శ్రేయస్కరమని తెలుసుకుని ప్రవర్తిస్తే అందరితో పాటు నీకూ మేలు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!