మధురబంధం

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

మధురబంధం

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

మధురం మధురం మధురం
మధురమైనబంధం మనది
చాటుమాటున కలుసుకున్నాం
చూపులు ఒకరికొకరం చూసుకున్నాం
చూపులు కలసిన శుభవేళ
మనకెంతో కలిగెను పరవశం
ఆ పరవశంలో మనల్ని మనం మరచిపొయాం
మనది మనసులు కలసిన బంధం
మనది మమతలు పెరిగిన బంధం
మన ఈ మమతల మనసులబంధం
కలకాలం కలసివుండాలని కొరుకున్నాం
ఊహాలన్నీ గుసగుసలాడుతూనే ఉన్నాయి
ఊసులాడుకున్న గుసగుసలు గీతాలాపన చేస్తున్నాయి
నీవులేక నేనులేను
నేనులేక నీవులేవు
మనం మనం బరంపురం
మనంతోనే జనం
జనంలోనే మనం
మననీ మనం విడదీసుకోలేం
మనని ఎవరు వీడదీయలేరు
మనది జన్మజన్మలబంధం
మధురమైనబంధం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!