అంశం::(“ఊహలు గుసగుసలాడే”)
నీ రాధని
రచన: రాయల అనీల
ఈ లోకంలో ఎందరు ఉన్నా…….
నువ్వు లేని నేను ఒంటరినే కృష్ణా
నువ్వే లేక ఈ ప్రాణం ఆగిపోమ్మన్నా…….
ఆ కాలం కదలనని మారాం చేసినా
కేవలం నీ చూపు కోసమే బ్రతికున్నా కన్నయ్య
ఊహలు గుసగుసలాడుతూ ఎంత వేదిస్తున్నా ,నా మనసును ఎంతలా చిత్రవధ చేస్తున్నా ఆగిపోయా
కేవలం నీ కోసమేనని పెదవి విప్పి చెప్పగలనా….చెప్పలేను
కనీసం ఇలా అయినా నా జీవితంలో లేని నువ్వు ……..
నా కనుల ఎదుట వుంటావని…. మిగిలున్నా
ఎప్పటికీ ఈ రాధనీ మరువవుగా కృష్ణ ……..
***