నీ ప్రేమ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : మాధవి కాళ్ల
నీ ప్రేమ కోసం నేను పరితపిస్తున్న..
అయినా నా బాధ నీకు ఎందుకు అర్దం కావడంలేదు..
ఎందుకు నీ ప్రేమ విషయం నాకు చెప్పలేదు..
నువ్వు నా కళ్ళలోకి చూస్తే నీకు అర్దం అయింది.
నువ్వే ఎప్పుడు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు..
ఎప్పుడు నన్ను ఎలా బాధ పెట్టాలో అనే చూస్తావు
ఒక రోజు కూడా నువ్వు నాకు నచ్చావు అని చెప్పలేదు.
నాకు తెలీకుండానే నిన్ను ప్రేమించాను..
నా ప్రేమ విషయం నీకు ఎప్పుడో చెప్పాలని అనుకున్నా..
కానీ కొన్ని పరిస్థితుల వల్ల నీకు చెప్పలేకపోయాను.
నువ్వు నన్ను అర్దం చేస్తున్నావు అని తెలిసింది…
నీ ప్రేమ విషయం నాకు తెలిసింది.
నువ్వు ఎప్పుడు నీ ప్రేమ విషయం చెబుతావని ఎంతో ఎదురు చూస్తాను.
అప్పుడే నాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు..
ఆ పెళ్లి చూపులలో నిన్ను చూడగానే నా ఆనందానికి అవధులు లేవు.
నీ ప్రేమ నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.