(అంశం :: “విమర్శించుట తగునా”)
సంద్రపు సోయగం
రచన::బండి చందు
ఇసుక తిన్నెలు
ముత్యపు ఆల్చిప్పలు
రత్నాల రాశులు
రంగురాళ్ల శంఖువులు
జలకన్యల జలకాలాటలు
ఎనలేని జలజీవులు
నా నిండా నీరున్నా
యద నిండా ఎంత సంపదున్న
వాటిని ఒకింతైన కానకుండా
ఒంటికన్ను దొంగలు
ఒరవడి పెంచే రాక్షస నౌకలు
ఎదురొచ్చే అలలు
వణికించే తుఫానులు
ముంచేసే సుడిగుండాలు
మరణం అంచులను సైతం
పరిచయం చేసే ప్రమాదపు ప్రయాణాలు
తెరచాపలతో తేలియాడు నావలు
ఇరుసున ఒరుసుకుపోయిన ఒడ్డు
అంటూ నన్ను విమర్శించ తగునా