చిలిపి చేష్టలు

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

చిలిపి చేష్టలు

రచన: చెరుకు శైలజ

నా చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్ అనిత కలిసి చాలా అల్లరి పనులు చేస్తూ బడిలో మంచిగా చదువుతు మంచిపేరు తెచ్చుకునేవారిమి
ఇద్దరం కలిసి బడికి వెళ్ళే వాళ్ళం
ఏం పని చేసిన ఇద్దరం ఆడుతూ పాడుతూ చేసిన వాళ్ళం. పొద్దున్నే బడికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాక
ఏదైనా తినెసి
ఆ రోజటి హోం వర్క్ చేసుకునేవాళ్లం .బడిలో నాపేరు అంజలి తను అనిత అంటే తెలలియని వారు ఉండరు .
మా బడి ఆ రోజుల్లో ముడు గదులు
ఆరు గుడిసెలతో ఉండేది.
ఎండాకాలం కూడా చల్లగా ఉండేది అన్ని వేపచెట్టులు ఉండడం వలన చల్లగా ఉండేది.
మధ్య మధ్య మా ఉపాధ్యాయులు చెట్ల కింద కూర్చో బెట్టి ఎక్కాలు చదివించేవారు.
అసలు మాకు బడి కి వెళ్లడం అంటే ఎంతో సంతోషంగా ఉండేది.
మా ఉపాధ్యాయులు కూడా మాతో స్నేహితులుగా ఉంటు పాఠాలు చెప్పేవారు.
వారిపై మా గౌరవం ఎక్కువ గా ఉండేది
. ఏదైనా తప్పు చేస్తే ఓపిక గా మందలించేవారు.
ఒక రోజు అంది మేము ఏడో తరగతి చదువుతున్న రోజులు
మా గుడిసేలో గోడలకి చిన్న గూడు ఉండేది.
అందులో చాక్ పిస్ డస్టర్ పెట్టు కోవాడానికి అది వాడే వాళ్ళం.
ఒకనాడు నేను అనిత పొద్దున్నే బడికి వెళ్ళక
మా తరగతి గదిని అంతా సర్దుతూ ఆ చిన్నగూడు చూశాక
ఒక తుంటరి ఆలోచన వచ్చింది. ఏయ్ అనితా చూడు ఈ గూడు ఎంతో బాగుంది కదా
అవును ముద్దుగా ఉంది అంజలి అంది.
రేపు మనం ఇందులో ఇంటి నుండి పౌడర్, దువ్వెన, అద్దం తెచ్చి పెడాదం
నేను అద్దం దువ్వెన తెస్తాను. నువ్వు పౌడర్, బొట్టు సీసా పట్టుకురా అనిత అంది. అమ్మో
మా అమ్మ ఏమైనా అంటే అంజలి అంది.
మా అమ్మ కూడా కొప్పడుతుంది.
ఇంట్లో చేపుదాం
మన బడిలో అవసరం అనిచెప్పుదాం అంది అనిత దానికి అంజలి సరే అంది.
ఈ ముచ్చట వీళ్ళు పెట్టు కుంటారు ఉంటే బెల్ మేగింది
అనిత,అంజలి అమితానందం నుంచి చూసి పద్మ రమ ఏం సంగతి చాలా సంతోషంగా ఉన్నారు అంటు వచ్చారు.
ఏం లేదు రేపు చూస్తారు కదా
. ఇంతలో అబ్బాయిలు వచ్చి
ఏమి సంగతి అక్కడ ప్రేయర్ బెల్ మెగితే ఇంకా మీరు కాస్లులోనే ఉన్నారా నడవండి అంటు
ఆ తరగతి క్లాస్ లీడర్ తొందర చేశాడు
సరే పదండి
అన్ని మీకు రేపే తెలుస్తాయి అంటు అనిత , అంజలి ఒకరి చేయి ఒకరు నవ్వుతూ ప్రేయర్కి బయలు దేరారు . సరే రేపే చూస్తాం అయితే అంటు వారు కూడా వీళ్ల తో గ్రౌండ్ కి బయలుదేరారు.
ఆ రోజు గడిచిపోయింది
.అనిత,అంజలి మరునాడు పౌడర్, అద్దం, దువ్వెన, బొట్టు సీసావారి బ్యాగులో పెట్టుకొని బడికి వెళ్ళారు. హడావుడిగా పోయిన వెంటనే
ఆ చిన్న గూట్లో పౌడర్, దువ్వెన, బొట్టు సీసా పెట్టారు
.ఆ గూడు పైన చిన్న మొల కొట్టి దానికి అద్దం తగిలించారు. ఆది చూసి వారి సంతోషానికి అవధులు లేవు .
బడికి ఒకొక్కరు వస్తున్నారు.
మా తరగతిలో అందరు వచ్చి వారు చేసిన ఆ పనిని చూసి అబ్బాయిలు నవ్వుకున్నారు.
అనిత,అంజలి నిలబడి ఆ అద్దం లో చూసుకోవడం , మురిసి పోవడం.
మేము చేసిన ఈ పనికి మా ఉపాధ్యాయులు ఎంతో మెచ్చుకుంటారో అని ఊహించుకుంటూ ప్రార్థన హాజరు అయ్యారు.
ఆ తరువాత అందరం తరగతిలోకి వచ్చి కూర్చున్నరు. తరగతి ఉపాధ్యాయుడు వచ్చారు
. హాజరు తీసుకొని నల్లబల్లపై రాయడానికి డస్టర్ కోసం చూస్తు ఆ గూటిలో ఉన్న వాటిని చూసారు .
ఏమిటి ఇది అన్నారు .అనితా లేచి నిలబడి సార్ మేమే పెట్టాం.మనం బడిలో అలసిపోతే అద్దం లో చూసుకొని తయారు కావచ్చు కదా అని
అంజలి చెప్పింది.
దానికి ఆ ఉపాధ్యాయుడు
ఆ గూడు దగ్గర నిలబడి చూసుకుని భలేగా ఉందే అంటు తన మొఖాన్ని చూసుకున్నారు. అలా మొదటి పిరియాడ్ సార్ మెచ్చు కొనేసిరికి అనిత, అంజలి చాలా సంతోషపడిపోయారు. రెండో బెల్ ఇంగ్లీష్ సార్ రాగానే సార్ సార్ ఒకసారి మేము చేసిన ఈ పని చూడండి అంటు అనిత
ఆ సార్ ని పిలిచింది .
ఏమిటి అంటు ఆయన అక్కడ ఉన్న వాటిని చూసి ఏమిటి ? ఓ తరగతిలో అద్దం అంటు చూశారు.
మేమే సార్ అవి పెట్టింది అంజలి అంది. ఆ సార్ అద్దం లో చూసుకోమని ఓ భలే అన్నారు . అబ్బా ఈ సార్ కూడా మనం చేసిన పనిని మెచ్చుకున్నారు. అని
సంతోషపడిపోయారు. ఈ విషయం ఆ బండి అంతా తెలిసిపోయింది .అందరు వేరే తరగతి వాళ్ళు రావడం
ఆ అందం లో చూసుకోవడం వెళ్లి పోవడం అనిత అంజలి ఎంతో ఎదిరించిన కూడా వాళ్ళు అలా భయం లేకుండా చూసి పోతునె ఉన్నారు. ఈ విషయం హెడ్మాస్టర్కి తెలిసి లంచ్ తరువాత గదిలో వచ్చారు .
ఎప్పుడు రాని హెడ్ మాస్టర్ చూసేసరికి తరగతిలో అందరికి భయం వేసింది.
అనిత, అంజలి ఏం చేశారు మీరు
మీ తరగతిలో నాకు చూపెట్టిండి అన్నారు
భయపడుతునే ఏంలేదు .హెడ్ మాస్టర్ గారు
ఇక్కడ ఇవి పెట్టాం
అని ఇద్దరు లేచీ వెళ్లి ఆ గూడుని చూపెట్టారు. ఓం అదా అందరు దీని గురించే చెప్పుకుంటున్నారు.
నేను వచ్చాను. అంటు లేచి నిలబడి ఆ అందం లో తన మొహం చూసుకొని బాగుందే మీ ఆలోచన అన్నారు.
అబ్బా వాళ్ల కి దైర్యం వచ్చింది .రండి కూర్చోండి మీరు చేసిన పని మంచిదే కాని బడిలో ఇలా చేయకూడదు.
మనం పొద్దునే తాయారై బడికి వస్తాం కదా
వచ్చాక అప్పుడు మనం చదువు మీద దృష్టి పెట్టాలి. కాని ఈ షోకుల మీద కాదు .
ఏదైన ఫంక్షన్లు జరిగినప్పుడు మీకు ఇలాంటివి అవసరం బడిలో అవసరం అవుతాయి .
అప్పుడు అవి మేమే ఏర్పాటు చేస్తాం. తెలిసిందా
మీకు తెలియక చేశారు.
ఈ పని అందుకే నెమ్మదిగా మందలించి వదిలేస్తున్నాను.
రేపు మిమ్మల్ని చూసి అన్ని తరగతుల వారు పెద్ద పెద్ద అద్దాలు తెచ్చి పెడుతారు.
అప్పుడు ఇది ఎగ్జిబిషన్లా తయారు అవుతుంది .
బడి లా ఉండదు .అందుకే అవి అక్కడ నుండి తీసెయండి .
మీరు ఇద్దరు బాగా చదువుతారు .ఇలాంటి తుంటరి ఆలోచనలతో చెడ్డ పేరు తెచ్చుకోకండి
బుద్ధి గా చదువుకోండి
మీకు మీ తరగతీ గదిలో ఏదైనా పెట్టాలి అనిపిస్తే జంతువులు పేర్లు మంచి మంచి బొమ్మలు గీసి గోడలకి అతుకు పెట్టండి.
అంతేకాని ఇలాంటి పని గాదు అని సున్నితంగా మందలించారు. అలాగే సార్ మమ్మల్ని క్షమించండి అంటు అనితా, అంజలి సార్కి సారీ చెప్పారు.
మంచి పిల్లలు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొండి అని చెప్పి వెళ్ళిపోయారు. అనిత, అంజలి వారు చేసిన ఆ తుంటరి పని వలన వారు తప్పు తెలుసుకుని బడిలో చదువుకున్న విలువ తెలుసుకొని బుదౄ గా చదువుకొని మంచిపేరు తెచ్చుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!