పాకెట్ మనీ

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

పాకెట్ మనీ

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

“ఒరేయ్ వంశీ, ఒకసారి బజారుకెళ్ళి ఒక కేజీ ఉల్లిపాయలు పట్రా! నాన్నగారి క్యారేజీ కి లేట్ అయిపోతుంది, ‘చస్తున్నాను ,నాన్న గారి ఆఫీసు లంచ్ కి క్యారేజీలో కూర ,పులుసు ,పచ్చడి ఉంటే గాని తినరు ,ఏది తక్కువైనా రాత్రికి ఇంటికి తినకుండానే తెచ్చి నానా తిట్లు తిడుతూ ‘మహాభారత యుద్ధాన్ని ప్రకటిస్తారు’ అసలే తిక్క మనిషి ఏం చేస్తాం! అంటూ అరుస్తూ గాభరాగా కిచెన్ లో కూరలోకి ఉల్లిపాయలు లేకపోయేసరికి గాబరా పడుతూ తన ఎనిమిది ఏళ్ళ కొడుకు’ వంశీ ‘ నీ పిలిచింది అనసూయ.
‘ఉండమ్మా వెళ్తాను! నా హోంవర్క్ ఉండిపోయింది, స్కూల్లో టీచర్ బెంచి మీద నిలబెట్టేస్తారు, అంటూ అనే సరికి వెధవ, నీకు ఒక్కడికి ఏదైనా లంచం ఇస్తే గాని పనిచేయవు, వెళ్ళు తొందరగా రా! అంటూ ఒక స్వీట్ చేతిలో పెట్టేసరికి అది చూసి నవ్వుతూ  బజారుకి పరిగెత్తాడు వంశీ.  ఇది ప్రతి రోజు జరుగుతున్న ప్రహసనమే.
‘ఏవండీ , మీ టిఫిన్ రెడీ అయ్యింది, వచ్చి తింటారా !అని గట్టిగా అరిచే సరికి ‘మాధవరావు గారు టిఫిన్ తింటూ’ క్యారేజీ కట్టడం అయిందా, ఇవాళ అసలే ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్’ కి వస్తున్నారు, తొందరగా వెళ్ళాలి! అని అనేసరికి ఒళ్ళు మండిపోయింది అనసూయమ్మ గారికి ‘మీకు ఎప్పుడూ ఆఫీసు పనులే, నెలవారి సామాన్లు సరిగ్గా తేరు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు,  రోజు మీ అబ్బాయికి చెప్పేసరికి వాడికి ఎక్కడలేని చిరాకు, సరిగ్గా వంట చేయకపోతే మీతో చాలా గొడవ మీ ఇద్దరు తోటి పడలేకపోతున్న
ఇంట్లో  నాకు నేనే అధికారిని, నేనే
బానిసను, ఏం తక్కువ అయినా భరించలేరు, పైగా వారానికొకసారి బంధుమిత్రుల ఆగమనం, సాదర సత్కారాలు, బాబోయ్ నా సంసారమే చెప్పాలి !అంటూ ఉల్లిపాయలు తెచ్చిన వంశీని’ రక్షించావు రా నాయనా! లేకపోతే ఈ వంటంతా రాత్రి ఇ నా ముఖం మీదే పడేస్తారు మీ నాన్నగారు, అంటూ క్యారేజీ భర్తకిచ్చి ఆఫీసుకు సాగనంపింది అనసూయ.
అలా రోజులు గడుస్తున్న కొద్దీ వంశీ కి ఆస్తమాను బజారుకెళ్ళి సామాన్లు తేవడం అమ్మానాన్న ప్రొద్దున్నే చిరాకు పడడం నచ్చడం లేదు. ఆరోజు నాన్నగారు ఆఫీసుకెళ్లిపోయాక అమ్మా! నాన్న గారు గానీ ,నువ్వు గానీ ఒక్క రూపాయి కూడా నా ఖర్చులు కు ఇవ్వరు, స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ ‘ఇంటర్వెల్ కి చిప్స్ ,చాక్లెట్స్ ,ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నేనొక్కడినే దూరంగా ఉండి చూడడం, పోనీ నాన్నగారిని అడుగుదామంటే’ ఏ వస్తువులు బయట తినకూడదు ఏదైనా ఇంట్లోనే తినాలి’ అని చిరాకు పడతారు, పోనీ నిన్ను అడుగుదామంటే నువ్వేమో నా దగ్గర ఎక్కడ ఉంటాయి డబ్బులు అంటూ బాధపడతావ్, అందుకే ఈరోజు నుంచి నేను  ఏ పని చేసినా వారానికి ఒకసారి  లెక్కకట్టి పెడతాను, నాన్నగారితో చెప్పి నాకు’ పాకెట్ మనీ ‘ఇప్పించు అని చెప్పే సరికి ‘అది ఏంట్రా? ఇంట్లో పనులు చేయడానికి నీకు డబ్బులు ఇవ్వాలా! అని నవ్వుతూ అడిగేసరికి ‘తప్పదు అమ్మ, డబ్బులు ఉత్తినే అడిగితే నాన్నగారు తిడతారు అంటూ బయటకు వెళ్ళిపోయాడు వంశీ.
ఆ మరుసటి వారం అంతా’ వంశి అమ్మ ఎన్నిసార్లు బజారుకు పంపిన మారు మాట్లాడకుండా తెచ్చి ఇచ్చే వాడు, ఆ రోజు ఆదివారం అనసూయమ్మ గారు ప్రశాంతంగా ఇంటి పనులు చేసుకుంటూ ఉన్న సమయంలో లో వంశీ వచ్చి’ అమ్మ నేను ఈ కాగితం మీద ఈ వారం రోజులు నేను తెచ్చిన సరుకులు, తెచ్చినందుకు నా శ్రమకు ఇవ్వవలసిన డబ్బులు  రాసి పెట్టాను, నాన్నగారికి చూపించి నాకు డబ్బులు ఇవ్వు, నేను కూడా స్కూల్లో అందరిలాగా ఖర్చు పెట్టుకుంటాను, అని అనేసరికి నిర్ఘాంత పోయింది తల్లి అనసూయమ్మ.
కాస్త తీరుబాటుగా కొడుకు ఇచ్చిన లెక్కల కాగితం చూసి అవాక్కయింది, మొదటి వరుసలో తారీకు, తెచ్చిన సరుకులు ,ఉల్లిపాయలు తేవడానికి 1/,
కాఫీ పొడి తేవడానికి.     1/
కందిపప్పు తేవడానికి.   1/
Bread దూరం వెళ్లి తేవడానికి 2/
నాన్నగారి బైక్ తుడవడానికి   5/
.అమ్మకి మందులు తెచ్చాను.  2/
ఇలా  వస్తువులు తెచ్చినందుకు ఇతరత్రా అన్నీ కలిపి మొత్తం 20 రూపాయలు
బిల్లు చేసి  ఇచ్చిన కాయితం పట్టుకొని  భర్త కి చూపిస్తూ” చూడండి మీ అబ్బాయి తెలివితేటలు” అంటూ ఆ కాయితం ఇచ్చింది, అది చూసిన వెంటనే మాధవరావు గారు పడి పడి నవ్వుతూ “అబ్బా నా కొడుకు చార్టర్డ్ అకౌంటెంట్ అయిపోతాడు “వాడికి ఇప్పటినుంచే ఖర్చులు తెలుస్తున్నాయి, సంతోషం వాడి శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా ఇద్దాం! అని కాగితం ఇచ్చేశారు, ఆశ్చర్యపోతున్న అనసూయ ‘లేదండి నేను వాడి అమ్మను, నేనింకా తెలివితేటలు గా  కాగితం రాసి ఇస్తాను, అనుకొంటు “ఆహా ఈ కాలం పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు,’ ఒరేయ్ వంశీ, నాన్నగారికి చెప్పాను డబ్బులు ఇస్తాను ,అన్నారు ఆం టూ నవ్వుతు  కొడుకుని దగ్గర తీసుకుని ముద్దుపెడ్తు’ ఇక పడుకో నాన్న ‘అంటూ తను కూడా పడుకుండి పోయింది.
‘ఆ మర్నాడు అనసూయమ్మ గారు ఒక కాగితం రాసి వంశీ స్కూల్ బ్యాగ్ మీద పెట్టారు, తన బ్యాగ్ మీద ఉన్న ఒక కాగితం చూసి చదివే లోపలే, “బాబు వంశీ, నువ్వు నువ్వు రాసిన కాగితం చాలా బాగుంది ,దానికి జవాబుగా నేను రాసిన కాగితం ఒకసారి చదివి నాకు చెప్పు, అంటూ అనసూయమ్మగారి చెప్పేసరికి ‘అలాగే అమ్మ !అంటూ హుషారుగా చదవడం మొదలు పెట్టాడు.
” నువ్వు పుట్టిన తేదీ 21-5-2014″
1, నిన్ను 9నెలలు నా కడుపులో మోసినండుకు.  ‘ఖర్చు లేదు,
2,నీకు డైపెర్స్ వేసి రోజు శుభ్రం చేసినందుకు.  ‘ఖర్చు లేదు,
3,నీకు ఆకలేసి ఏడ్చినప్పుడు నా పాలు
…పట్టినప్పుడు. ‘ ఖర్చులేదు,
4, నీకు జ్వరం,జలుబు చేసినప్పుడు నేను, నాన్న గాభరా పడ్తు రాత్రిపగలు నిద్ర లేని రాత్రులు కు.   ‘ ఖర్చులేదు,
5, నువ్వు ప్రతి.సంవత్సరము చేయించు కొనే ‘పుట్టిన రోజు పండుగ కు.    ‘ఖర్చు లేదు,
6, నీ ఎదుగు ధలకు రకరకాల ‘పౌష్టిక ఆహారాలు’ అందించినందుకు. ‘ఖర్చులేదు,
7,నీకు స్కూల్ కి కావలసిన వన్నీ అప్పులు చేసైన సరే భరించాను.  ‘ఖర్చులేదు,
8,నేను నాన్న అన్నివిధాల నీ బంగారు భవిష్యత్తు కోసం రాత్రిం బగల్లు ఆలోచించడానికి.       ‘ఖర్చు లేదు.!””””

     ‘ వంశీ ఇన్ని విధాల ఖర్చులు రాయని తల్లినితండ్రిని, నువ్వు ఇంటి కోసం చే సిన పనులకు లెక్క రాయడం తప్పు కదా నాయనా! కుటుంబం మనేది ఒకరినొకరు ప్రేమించుకుంటూ, నిస్వార్ధంగా కలిసి జీవించడం అని తెలుసుకో, త్యాగం చేసినట్లు ఆలోచించకుండా ముందు కుటుంబ ఐక్యతతోనే, దేశ ఐక్యత కూడా సాధ్యమవుతుంది ,ఇది నేను నీకు నేర్పుతున్న అత్యున్నత పాఠం, ప్రతి పిల్ల, పిల్లవాడు, తప్పక కుటుంబ శ్రేయస్సుకోసం ఏ త్యాగానికైనా సిద్ధ పడాలి.
“వంశీ నువ్వు అడిగిన నా ‘పాకెట్ మనీ’ నాన్నగారు ఇస్తానన్నారు సరదాగా ఉంటూ, బాగా చదువుకొని  నేను నీకు ఇచ్చిన అత్యున్నత పాఠం నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి జీవితం సార్థకం చేసుకో. నీ అమ్మ.
ఆ ఉత్తరం చదివిన వంశీ కి కళ్ళ నిండా నీళ్ళు తిరుగుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లి ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు, “అమ్మ ఇంకెప్పుడూ నిన్ను నాన్న గారిని బాధ పెట్టను” అంటున్న  కొడుకుని దగ్గరకు తీసుకుని ఒదార్చింది అనసూయమ్మ గారు.***********

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!