అనుమానం- పెనుభూతం

అంశం: కొసమెరుపు కథలు

అనుమానం- పెనుభూతం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

     ఏమండోయ్  మిమ్మల్నే వినిపిస్తున్నాదా. నా భాధ నాదే గాని మీకేం పట్టదు. పనులన్నీ మీరే చేస్తారు కానీ నా నోరు మాత్రమే వినిపిస్తుంది. అందరికి అని కాంతమ్మ గారు  భర్త సుబ్రహ్మణ్యం గారితో అన్నారు. వినిపించక పోవడానికి నీవు నెమ్మదిగా మాట్లాడావ, ఆ గావుకేక ఏమిటి కుర్చీలోంచి వెంటనే నీ దగ్గరకు రావడానికి నీనేమి నాలభైలో ఉన్నాన అని వంటిట్లోకి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. భర్త రాగానే కాంతమ్మ దగ్గరగా వెళ్ళి ఆయన చెవి దగ్గర మన క్రింద వాటాలో అద్దెకిచ్చిన సుశీలమ్మ ఇంటికి మళ్ళీ ఆ తెల్లటి బట్టతల వాడు వచ్చాడు. వారానికి రెండు మూడు సార్లు వస్తున్నాడు. ఏదో మన కులం ఇద్దరు పిల్లలతో భర్తలేని ఆడది కూతురు లేని మనం ఆమెని పిల్లలా చూసుకుందాం. మగపిల్లలు దెబ్బపళ్ళ లా లవ కుశులు లా ఉన్నారు అనుకున్నాము. మన ఒక్క కొడుకు అమెరికా లో ఉన్నాడు. మనకి తోడుగా ఉంటుంది  అని అద్దెకిచ్చాము. సరిగ్గా సాయంకాలం ఆరున్నరకి వచ్చి ఎనిమిది వరకు ఉంటాడు. వారానికి రెండుసార్లు టంచనుగా వస్తున్నాడు. చూడడానికి పతివ్రతలా ఉంది పాపం పుణ్యం భగవంతునికే తెలియాలి. నేను చెపితే బాగుండదు. మీరే ఆమెతో పెద్దవారిగా చెప్పండి. సమాజానికి వెరవాలి కదా అని నెమ్మదిగా చెప్పారు. విన్నవెంటనే సుబ్రహ్మణ్యం గారు కాంతం నీ కన్నీ ఇటువంటి ఆలోచనలే పాపం సుశీల భర్త పోయి రెండేళ్ళయి భర్త ఆఫీసు లో ఉద్యోగం చేస్థు, పిల్లలిద్దరి చదువుసంధ్యలు చూస్తు తెల్లవారుజామునే పూజ, దైవ సంకీర్తనలు చేస్థు నీ కన్నా ముందే లేస్తోంది వెధవ ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు అంటూ భార్య ని మందలించారు. నెలరోజుల తరువాత  వినాయక చవితి సాయంత్రం కాంతమ్మ గారు సాయంత్రం సుశీల ఇంటికి దేముణ్ణి చూడడానికి వెళ్ళి అరగంట తరువాత ఇంట్లోకి  రాగానే ఏమండోయ్ ఇలా రండి అని భర్త ని పిలచింది. మళ్ళీ ఏమొచ్చింది గావుకేక పెట్టావు అన్న భర్త దగ్గరగా వెళ్ళి పాపం క్షమించమని శ్రీరామచంద్రుని లాంటి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏమయిందంటే నేను సుశీల ఇంటికి వినాయకుని చూడడానికి వెళ్ళితే ఆ బట్టతల ఆయన అక్కడే ఉన్నాడు. నన్ను చూడగానే సుశీల రండి పిన్ని గారు పెద్ద ముత్తైదువు పార్వతీ దేవిలా వచ్చారని, అయనతో అన్నయ్య నేను చెబుతాను నన్ను కన్నకూతురులా చూసే కాంతం పిన్ని గారు. అని నాతో మా పెద్దమ్మ కొడుకు బాబ్జి అన్నయ్య ఇక్కడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ మా ఆయన పోయిన తరువాత రావలసిన పి. ఎఫ్, అన్ని స్వంత్ చెల్లిలా చూసి ఎంతో సహాయం చేసాడు. మా అమ్మ గారి రెండో అక్క కొడుకు శంకరం అన్నయ్య అని చెపుతుంటే బుర్ర తిరిగినంత పనయింది రండిరా పిల్లలు అని సుశీల, పిల్లలతో బాటు పుత్ర సమానుడయిన శంకరం కూడా నా పాదాలకు నమస్కరిస్తుంటే విస్తుపోయాను. శంకరం నాతో చెల్లి ఎప్పుడు చెపుతుంది మీరు, బాబాయ్ గారు దేముడు తనకిచ్చిన తల్లిదండ్రులు అని ఎంతో బాగా పిల్లల్ని మనుమల్లా చూసుకుంటారని అందుకే దైవం మానుష రూపేణా అన్నది అక్షర సత్యం పిన్ని గారు అన్నాడు. నేను అచేతురాలనయ్యాను. మీరు చెప్పిన అనుమానం పెనుభూతం అక్షర సత్యం.
అని భర్త పాదాలకి నమస్కారం చేస్తే లే చిన్నపిల్లలా అని కాంతమ్మ గారిని భర్త ఆప్యాయంగా హృదయానికి హత్తుకున్నారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!