కోడలి తెలివి

అంశం: కొసమెరుపు కథలు

“కోడలి తెలివి”
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

     శివగిరి అనే ఊరిలో రంగయ్య అనే రైతు కుటుంబం ఉండేది. రంగయ్య తల్లి రంగయ్య తో పాటే జీవిస్తుంది. కొడుకు ను ప్రేమగా చూసుకొనేది. రంగయ్య కు ఇటీవలే పెళ్లి జరిపించి కోడలిని కాపురానికి కూడ తెచ్చుకొంది. రంగయ్య తల్లి !ఇంటిపెత్తనం అంతా రంగయ్య తల్లి దే, కొడుకును బాగా చూసేదిగాని రంగయ్య తల్లి కోడల్ని నానా బాధలు పెట్టేది. కడుపు నిండా అన్నం కూడ పెట్టేది కాదు. ఇంకా ఇంత మంచి కూరలు తిని కోడలు చాల రోజులై నోరు సమిచి పోయింది. వాళ్ళ ఇంటి పెరట్లో కూరగాయల మొక్కలు ఉన్నా వాటిని కోసి రంగయ్య తల్లి తను మాత్రమే ఉండుకొని తిని కోడలకు కనీసం ఉప్పు కూడ చూడనిచ్చేది కాదు.మంచి కూర తినాలని కోడలికి కోరికగా ఉండేది. కానీ ఏం చేస్తుంది. ఓ రోజున అత్తగారు తన చుట్టాలను పలకరించి వస్తానని ఆ పక్కనే ఉన్న పాలెం వెళ్లింది. “ఇదే సమయమని చక్కగా కూర వండుకుని అన్నం తిందామని కోడలు పెరట్లో ఉన్న సోరకాయ ను కోసుకోని తాళింపు పెట్టుకొని వేడిగా అన్నం వండి తిన బోతుంది”. అనగా!అత్తవచ్చి తలుపు తట్టింది. కోడలికి గొంతులో యాలక పడింది. వెంటనే ఆ వండిన అన్నం కూర బిందెలో పెట్టుకొని అత్త గారికి తలుపు తీసి తాను ఆ బెందెను చంక న పెట్టుకొని మంచినీళ్ళు కు పోయివస్తానని బయటికి వెళ్ళింది. ఆ నూతి దగ్గర మాత్రం అమెకు వీలు చిక్కతుందా? ఆ ఇరుగు పొరుగు వారు అంతా నీళ్ళకు వచ్చారు. అక్కడ తినడానికి వీలులేక నోరు ఊరుతున్నా ఉపాయంగా మరి కొంచెం దూరంలో ఉన్న ఒక పోలేరమ్మ గుడి లోకి పోయి ఎవరైన వచ్చి చూసి అత్తగారికి చెప్పుతారేమో అని ఆత్రంగా పెద్ద పెద్ద ముద్దులు చేసి తినడం ప్రారంభించింది. అలా తినడం పోలేరమ్మ కే ఆశ్చర్యం వేసి పెద్ద గా నవ్వింది. పోలేరమ్మ ఈ.  అన్నం కూర, ఎంది అని అనగానే,కోడలు లేచి నీళ్ళతోడుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం గుడిపూజారి వచ్చి పోలేరమ్మ విగ్రహం నవ్వు మొహం చూచి ఆశ్చర్య పోయాడు. పరుగు పరుగు న పోయి గుడి ధర్మకర్త తో ఈ సంగతి చెప్పాడు. ధర్మకర్త పెద్ద పూజారిని పిలిపించాడు. ఇది వింతకాదు,ఇది మన ఊరి కి అరిష్టం అన్నారు. పెద్ద పూజారి గుడిలోని పోలేరమ్మ విగ్రహం మునిపిటిలా గా ఉండేలా!చేసిన వారికి పదివేల నాణ్యాలు ఇస్తామని ప్రకటించారు. పదివేలు అనగా నే చాలమంది ప్రయత్నించారు. కాని పోలేరమ్మ నవ్వు మూతి మారలేదు.  నే మారస్తానని బయలు దేరింది కోడలు, మళ్ళీ బిందె ని కూడా తీసుకుని గడిలోకి వెళ్ళి తలుపు లేసి బిందె పైకి ఎత్తి పోలేరమ్మ తో “మొగుడు చాటు పెళ్ళాలుంటారు, అత్తచాటు కోడళ్ళ ఉంటారు. గ్రామశక్తి ఈ మాత్రం తెలివి ఉండడాలి కదా! నీకు?నన్ను చూస్తే అంత చులకనగా ఉందా నవ్వుతున్నావు. ఈ బిందెతో మూతి పైన వెయ్యమంటావా?  అంది అమాయకంగా పోలేరమ్మ బెదరిపోయి నవ్వుతున్న మొహం మార్చి మాములై పోయింది. కోడలి శక్తి కి ఊరివారంతా ఆ‌శ్చర్య పోయారు. ధర్మకర్త అన్న మాట ప్రకారం ఆవిడకు వెయ్యి నాణ్యాలు దాంతో పాటు గా పండ్లు కుంకుమ చీరలు ప్రసాదం ఇచ్చారు. అత్త గారి మూతి తిప్పుకొంది. కొంచెం గౌరవంగా చూడడం మొదలు పెట్టింది. ఎందకంటే కోడలు వెయ్యి నాణ్యాలు తెచ్చినందుకు, అప్పటి నుండి ఊరి వారు కూడా పోలేరమ్మ నే బెదరుకొట్టిన ఇల్లాలు కాబట్టి ఆవిడ పోలేరమ్మ కన్న ఈవడే గొప్ప గా బావించి ఆ రోజు నుండి మ్రొక్కు బడులన్ని కోడలి కే ఇవ్వడం మొదలు పెట్టారు. ఇక రంగయ్య ఇల్లు పళ్ళు ఫలహారం కోళ్ళు గొర్రెలు తో నిండిపోతుంది. అత్తగారికి సంతోషంతో పాటు అసూయ భయము ఏర్పడింది. ఓ రోజున కొడుకు తో రహస్యంగా  పిల్చి ఒరే రంగయ్య! నీ పెళ్ళాం సామాన్యం అయింది కాదు నాయనా! ఇదేదో గ్రామశక్తి అమ్మవారు నిన్ను నన్ను కూడా మింగేస్తుంది.ఎందకైన మంచిది ఈ పీడను వదిలించుకోని నువ్వు మళ్ళీ పెళ్ళిఆడురా! అని సలహా ఇచ్చింది.”ఎలాగ వదుతుంది ఈ పీడ? అన్నాడు. రంగయ్య ఒక ఉపాయం చెప్పింది తల్లి అలాగే అనుకున్నారు. కోడలి నోట్లో గుడ్డలు కుక్కి ఓ చాపలో చుట్టబెట్టి తాడుతో గట్టిగా కట్టి రంగయ్య, వాడి తల్లి ఇద్దరూ కలసి స్మశానానికి మోసుకు పోయారు. అక్కడ కట్లు పేర్చి నిప్పు అంటించ పోయారు.కానీ అంటించటానికి నిప్పు లేక తల్లి నీవు ఇక్కడే ఉండు నేను నిప్పు  తెస్తాను అనగా అమ్మబాబో నేనుండ లేను అన్నాడు. సరే అనుకొని ఇద్దరూ పోయీ నిప్పు తెవడానికి నిశ్చయించు కున్నారు ఆ చాపచుట్టు అక్కడ పెట్టి ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ లోగా కోడలు కట్లు విప్పుకొని మెల్లగా బయటకు వచ్చి ఆప్రక్కననే వున్నా ఒక ఈత బొంద ఆ చాపలో కట్టేసి ఓ చెట్టుక్కి కూర్చుంది. తల్లీకొడుకు నిప్పు తీసుకుని వచ్చారు చాప చుట్టిను పెర్చిన కట్టేలపై పెట్టి నిప్పు అంటించారు. ఇక పీడ వదిలింది అనుకున్నారు. రంగయ్య, రంగయ్య తల్లి ఇంటికి పోగా కోడలు చెట్టు పైన కూర్చుని నిద్రపోయింది. ఇంతలో ఆ చెట్టు దగ్గరికి కొంత మంది దొంగలు దోచుకున్న నగలు డబ్బు తెచ్చి లెక్కపెట్టు కుంటున్నారు. ఆచెట్టు మీద ఉన్న కోడలు కునికి జారీ దభేలు న కింద పడింది. ఆ పడ్డంతో ఆ అరుపుకు దొంగలు వారిని పట్టుకోవడానికి వచ్చిందను కోని పోలేరమ్మ కే బయపడలేదు మనమెంత అని తెలుకొని నగలు, ధనము అక్కడే వదిలేసి పరుగులు తీశారు. కోడలు నగలు, ధనము తీసికొని తెల్లవారే సరికెల్లా ఇంటికి పోయి తలుపు తట్టింది. మొగుడు, అత్త, హడలి పోయారు. ఇద్దరూ  తలుపు తీశారు. భయంతో కోడల్ని చూచి దెయ్యం అని నిశ్చయించు కుని కళ్ళు తిరిగి పడిపోయారు. కోడలు వారికి ధైర్యం చెప్పి అత్త నన్ను దేవదూతలు స్వర్గానికి తీసుకోని పోయారు. అక్కడ మామగారు కనపడి కుసల ప్రశ్నలు వేసి ఇదిగో ఈ నగలు ధనం, ఇచ్చారని నమ్మకం కలిగెట్టు అన్ని చూపించింది. నిజమే అని నమ్మింది అత్త ఇంకా ఏమైనా చెప్పాడా ఆయన అని అడిగింది. మీ అత్తను చూచి చాలా కాలం అయింది ఒక పుష్కరం ఐనది. ఓ మారు చూడాలని ఉంది నీవు వెంటనే వెళ్ళి మీ అత్తను పంపించు. ఈ నగలు అవి ఇవి ఇచ్చి ఇక్కడ నాకేంలోటులేదు కావలసినంత భోగం అన్నాడు. మీ అత్త వచ్చిన సరే రాకపోయినా సరే అన్నాడు మామ అని చెప్పింది. కోడలు”అయ్యో ఎంత అదృష్ట వంతురాలవే? మామగార్ని చూడగలి గావు నాకు మాత్రం చూడాలని లేదంటే. ఆయన్ని చూసి ఎన్నాళ్లయిందో!! ఇంత కంటేనాకేమి కావాలి అని ఈ రోజే పోయిరావాలి అని తొందరచేసింది. తనను కూడా ఆ రాత్రి కే చాపలోచుట్టి దహనం చెయ్యమని కొడుకును, కోడల్ని బతి మాలింది. మళ్ళీ తొరగానే తిరిగి వచ్చేస్తానన్నది. వాగ్దానం చేసింది. సరే అన్నారు. కొడుకు కోడలూనూ.ఆ రాత్రి అవిడను చాపలో చుట్టి స్మశానంలోనికి తీసికొని పోయి చక్కగా నిప్పు అంటించారు. తెల్లవారి. అమ్మరాలేదు. ఏమే!? మా అమ్మ రాలేదేం అన్నాడు.భర్త రంగయ్య వస్తాతాది.లేద్దు తోందరపడకు అంత ఆత్రమా అన్నది. భార్య అలాగ!మూడురోజులు గడిచినా, అమ్మారాలేదు. ఏమే అమ్మ రాలే దేమంటావు అన్నాడు. అయ్యో చాలా రోజులకు వెళ్ళారు కష్ట సుఖంలు చెప్పుకోవాలామరీ?  అప్పుడే వదుల్తారా మామ గారు వస్తారు లే నెల లోపు, అంది భార్య. నెల గడిచింది అమ్మ రాలేదు, ఎందుకు రాలేదంటావు, అన్నాడు. రెండు నెలలు గడిచాయి, రాలేదు. ఇక లాభంలేదని భర్త ను సావకాశంగా కూర్చోని ఆచెట్టు దగ్గర జరిగినదంతా చెప్పింది. అమ్మ ఇంకరాదని తెలుసుకొని అమ్మకోసం అప్పడప్పుడు ఏడ్చినా!భార్య,భర్త ఇరువురు ఒకరికొకరు “కొసమెరుపులు”దిద్దుకొని భార్యకు అత్త బాధ తప్పిందని సంతోషిస్తూ, హాయిగా దంపతులు లిద్దరూ చాలా కాలం హాయిగా గడిపారు.
అలాంటి అత్త గారి బాధ యుక్తి గా తప్పించు కుందని విన్న వాళ్ళుంతా “కోడలి తెలివి”కి సంతోషించారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!