గోదావరి

గోదావరి

రచన:వి విజయశ్రీదుర్గ

ఆయ్ మేము గోదారొళ్లము అండి
మాతాతలది రాజమండ్రే అండి
ఆ అన్నవరం సత్యదేవుని సాక్షిగా
ఎట్టెట్టా మేము కూడా గోదావరే నండి
మాది తెనాలి మీదితెనాలి అన్నట్టు
ఆ మర్యాద ఆ మాటఎవరికొస్తుంది
ఆ ఆత్మీయత ఆ అపేక్ష పెట్టి పుట్టాలి
అవునండోయి బహుబాగుగాచెప్పారు
ఆ పూతరేకులు ఆ మడతకాజా
ఆ రాజమండ్రి ఆ గొదావరి తల్లి
ఆ రాములోరి గుడి ఆ భక్తి పరవశం
నిజంచెప్పొద్దుప్రాణంఇవ్వాలనిపిస్తుంది
ప్రాణానికి ప్రాణం పంచే అనుబంధాలూ
ఎదో మంత్రదండమే ఆ ఉరి నీటిలో
రాజమహేంద్రవరంకు జైజైలు
గోదారమ్మతల్లికి ప్రణామాలు
ఆ గంగమ్మకు శతకోటివందనాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!