ఈనాటి కలియుగ రావణులకు అలనాటి రావణుని సందేశం

ఈనాటి కలియుగ రావణులకు
అలనాటి రావణుని సందేశం

రచన: పుష్పలత బండారు

అయ్యారే ఏమి విచిత్రము
ఏమి కలియుగము
ఆనాడు నేను సీతాదేవిని
అపహరించి
అశోకవనంలో
బంధించి కనీసం
తాకకున్ననూ
నన్ను దుర్మార్గుడిగా ముద్రవేశారు!!

మరి ఈనాటి కామాంధులు యువతులను పసిపిల్లలను
ముసలివారని కూడా చూడక చెరబట్టి
బలి తీసుకుంటున్నారే!!

ఈ రక్కసి మూకల గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గుగా వుంది
ఈ నరరూప రాక్షసుల కన్నా నేనే నయం కాబోలు!!

ఓరి నీచ మానవ!!
ఆడవారి పట్ల
నీచమైన ఆలోచన ఇకనైనా మానవా!!

నేను రావణబ్రహ్మను ధర్మాధర్మ విచక్షణ కలవాడినే
కానీ ఒక బలహీన క్షణాన
పరాయివాడి భార్యను చెరబట్టినందుకు
నా చరిత్ర సర్వనాశనం అయింది!!

తస్మాత్ జాగ్రత్త!! ఆడది ఆదిశక్తి ఆమె
తలుచుకుంటే ఏమైనా చేయగలదు
అందుకే వాళ్ళతో పెట్టుకోకండి. ఆడవారికి సముచిత గౌరవం ఇవ్వండి. సమాజంలో చక్కని సుహృద్భావ వాతావరణాన్ని కల్పించండి.

ఈ సమాజంలోనే మీ భార్యాపిల్లలూ అక్కచెల్లెళ్ళు ఉన్నారని
మరువకండి!!

నిన్ను కని చనుబాలిచ్చిన అమ్మని ఆడవారిలో చూడండి!!

అమ్మలందరూ మీ ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పడం కాదు
మీ తనయులకు
సంస్కారం బోధించండి
ఆడవారికి గౌరవ మర్యాదలు ఇవ్వమని చనుబాల నుంచే వారికి నేర్పండి
అప్పుడే
ఆడవారిపై జరిగే అకృత్యాలు
అమానవీయ ఘటనలు ఆపగలం!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!