కోర్కెలు గుర్రాలైతే..

కోర్కెలు గుర్రాలైతే..

రచన: జీ వీ నాయుడు

మిన్ను బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగాల వేట లో ఉంది. ఇంతలోనే ఓ ప్రవేటు ఆసుపత్రి లో అవకాశం వచ్చింది. అంతే ఆ మరుసటి రోజే ఉద్యోగం లో చేరింది. వారంలో ఆసుపత్రి కి రెండు రోజులు వరుసగా పెషేంట్ అటెండెంట్ గా వచ్చిన బాబు అనే యువకుడికి గాలం వేసింది. తన పేరు, ఊరు, కులం, చదువు అంతా మార్చేసి ఉన్నతంగా చెప్పుకొని బాబుకు దగ్గరయింది. వారం లోపే అతనితో మమేకమైంది.
పెళ్ళి ప్రపోసల్ కూడా సిద్ధం చేసింది.. ఇంత త్వరగా అన్నీ ఎలా ముగించాలి అనే అయోమయంలో పడ్డాడు బాబు. ఒక రోజు చెన్నై టూర్ కు వెళ్ళాలి అంటూ సిద్ధం చేయించింది
ఇద్దరు చెన్నై కి వెళ్లడం.. మూడు రోజులు ఆనందం లో మునిగి తేలారు. సుమారు నాలుగు లక్షలు షాపింగ్ కు ఆవిరి అయ్యాయి.. ఆనందం సంగతి దేవుడెరుగు.. ఇదే తరహాలో కొంత కాలం సాగితే కట్టు బట్టలూ మిగలవేమో అనే ఆలోచనతో అయోమయం లో పడ్డాడు బాబు. మెల్లగా సొంతూరు విజయవాడ కు తిరిగి వచ్చారు. వారం గడిచింది. హైదరాబాద్ టూర్ ఫిక్స్ చేయించింది. హైదరాబాద్ కు వెళ్లి రెండు రోజులు సరసాల సాగరంలో మునిగిపోయారు. ఒక రోజు బాబుకు పూర్తిగా మందు తాగించి, బ్యాంకు బాలన్స్, చెక్కు బుక్కులు,ఎటిఎం కార్డు లు మొత్తం సొంతం చేసుకుంది. మత్తు దిగక ముందే అన్ని చెక్కు లపైన సంతకాలు చేయించింది. రెండు రోజులు గడిచాక అర్ధం అయింది.
ఇక లాభం లేదు అనుకోని బాబు పరారయ్యాడు. అమ్మయ్య. ఒక వికెట్ అవుట్ అనుకుని రెండో వాని కోసం స్కెచ్ వేసింది
ప్రవేటు ఆసుపత్రి లో జీతాలు అంతంత మాత్రమే. సెలవులు అధికంగా పెట్టడంతో ఆ ఆసుపత్రి లో జాబ్ పోయింది. మరో ప్రవేటు ఆసుపత్రి లో ఉద్యోగం సంపాధించింది.
వారం లో ఒక యువ డాక్టర్ కు వలవేసింది. వారం గడిచాక ఆ యువ డాక్టర్ యాజమాన్యం తో సంప్రదించి ఆ విభాగం లోనే ఆమెకు డ్యూటీ నిర్వహించే ఏర్పాట్లు చేసుకున్నారు. నాలుగైదు రోజుల్లోనే దగ్గర అయ్యారు. గతంలో నైట్ డ్యూటీలు ఇష్టపడని డాక్టర్ ఓటీ చేస్తున్నారు. ఒకేర్ని వదిలి ఒకరు ఉండలేరు అనే స్థాయి కి పాకింది వారి ప్రేమ. ఇక ఆదాయం రాబట్టే పనుల్లో పడింది.. డాక్టర్ సొంత క్లినిక్ లో పాగా వేసింది. సహజం గానే సాదా సీదాగా ఉండే డాక్టర్ తనలో కనిపించే మార్పులు ఇంట్లో యుద్దాలను రగిలింప చేసింది. సుమారు కోటి రూపాయిలు డాక్టర్ ద్వారా పొందింది. డాక్టర్ అయోమయం చూసి ఆయన సతీమణి ధైర్యం చేసి రంగం లోకి దిగింది. డాక్టర్ భార్య నళిని మంచి అందగత్తే. కరుణా మూర్తి. ధైర్య శాలి. ఉద్యోగి, ఉద్యోగి లాగే ఉండాలని మిన్నుని తీవ్రంగా హెచ్చరించింది. ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో మిన్ను డాక్టర్ దంపతులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించి, అసలు జరిగిన విషయం తెలుసుకుని మిన్ను ఫై కేసు నమోదు చేశారు. జైల్లో జీవితం గడపడం మూలంగా తాను చేసిన తప్పులను ఒప్పుకొని చెంపలేసుకుంది
కోర్కెలు గుర్రాలయితే చివరికి కటకటాలు పాలు కావాల్సిందే అని మిన్ను జైల్లో శిక్ష అనుభవించింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!