అసలు విషయం

అసలు విషయం

రచన: నామని సుజనాదేవి

‘హలో…హనీ…. నీకోసం ఎదురు చూస్తున్నాను….మరో అరగంటలో ట్రైన్ వస్తుంది…. ఏమీ ఆలోచించకు… పిల్లలు,మీ వారు పడుకున్నారు కదా … త్వరగా వచ్చేసేయ్….. అప్సరసలకు తలదన్నేలా ఉన్న నీ అందానికి కాకిముక్కుకు దొండపండులా ఉన్నాడు… వచ్చేప్పుడు అన్ని నగలు పెట్టుకున్నావో లేదో సరిచూసుకో….’ ఆత్రంగా అన్నాడు సుభాష్.

‘నీ మాయలో పడి నీతో వచ్చేస్తానన్నాను. కాని పనిఒత్తిడిలో కొప్పడ్డా, నన్ను పొగడకపోయినా , అడుగడుగునా ఆయనకు నాపై ఉన్న ప్రేమకనబడుతూనే ఉంది. నగలు తీసుకురమ్మన్న నీవు,
మరెవ్వరినీ నాలా మోసం చేయకుండా, మావారు పోలీసులతో నీ పక్కనే ఉన్నారు చూడు ‘ మాలతి మాటలకు అయోమయంగా చూశాడు సుభాష్.
అల్లంత దూరంలో పోలీసులతో దగ్గరకు వస్తూ ఉన్నా మాలతి భర్త కనపడ్డాడు. ఖంగుతిన్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!