మా పల్లె అందాలు
-నారుమంచి వాణి ప్రభాకరి
మా పల్లెలో
అవి పొలాలు కావు
పచ్చని పైరుల అందాలు
అవి ఆరుగులా కావు
వేద విజ్ఞాన పాఠశాలలు
అవి లోగిళ్ళు కావు
శ్రీ ధాన్య లక్ష్మి ధన లక్ష్మి సంపదలు
అక్కడి వారు సామాన్య లా
కాదు
వేద పండిత జ్ఞాన సంస్కృత నిధులు
అక్కడి ఆత్మీయ ఆదరణ
అపూర్వం అద్భుతము
ఆ ఊరు ఇళ్ళు లక్ష్మి పార్వతి సరస్వతుల నిలయాలు
ఎందరికో ఉపాధి నిచ్చిన
జీవిత మిచ్చిన పుణ్య భూమి
శ్రీ కంచి కామ కోటి స్వామి ఎంతో మెచ్చుకున్న గ్రామము
సహనానికి సహకారానికి
మారు పేరు మా పుణ్య గ్రామము
****