నాకో ప్రపంచం కావాలి (కవితా సమీక్ష)

నాకో ప్రపంచం కావాలి (కవితా సమీక్ష)

సమీక్షకురాలు: జయ

కవితా శీర్షిక: నాకో ప్రపంచం కావాలి
రచన: కార్తిక్ నిమ్మగడ్డ

రచయిత శ్రీ నిమ్మగడ్డ కార్తిక్ గారు తన కవిత ద్వారా నాకోప్రపంచం కావాలి అని అడుగుతున్నారు. ఆయనే ఒక ప్రత్యకమైన వ్యక్తి అనుకున్నాను. కానీ ఆయన కలలు కనే ప్రపంచం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. నేను చదివే రచనలలో కార్తిక్ సర్ రచనలు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు చదివిన మనస్సుకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది.
నాకో ప్రపంచం కావాలి అని సర్ అడిగిన తీరు నాకు చాలా బాగా నచ్చింది.
కలలు కనే కళ్ళు కలలు వెనుక దాగుండని ప్రపంచం
కలలు అనేవి ఆ కలలు వెనుకే ఉండి పోనీ, ప్రతి కల నిజం చేసుకొనే ప్రపంచం కావాలి అని అడుగుతున్నారు.
చిరునవ్వు వెనుక మౌనం దాగాని ప్రపంచం
కొందరు తమకు ఉన్న భారం, బాధను మౌనంగా భరిస్తూ చిరున్నవ్వు ను చిందుస్తూ ఉంటారు. అలా కాకుండా తమ మనస్సులో మాట ధైర్యంగా చెప్పే ప్రపంచం కావాలి అని అడుగుతున్నారు.
ఆశల పల్లకిలో కాటికి చేరని ప్రపంచం కావాలి
ప్రతి ఒక్కరికీ ఆశలు ఉంటాయి. ఆశ పడతారు కానీ ఆశలు తీరకుండానే కాటికి చేరుకుంటారు. అలా కాని ప్రపంచాన్ని కవి కోరుకుంటున్నారు.

ఇంకా కవి నేటి ప్రపంచంలో ప్రాథమిక అవసరాలు అయిన తిండి, కూడు, గుడ్డ కూడా దొరకడం కష్టం గా ఉన్న కాలంలో ఉన్నాం.
ఆకలి చావులు లేని ప్రపంచం కావాలి అని అడుగుతున్నారు.

కులము చాటున కపట నాటకలు లేని,మతం చాటున మౌఢ్యం లేని ప్రపంచం కావాలి
మాయమాటలు స్వార్ధం లేని ప్రపంచంకావాలి
కవికి సమాజం పట్ల ఉన్న నిస్వార్ధమైన ప్రేమ కనపడుతుంది. కానీ ఇప్పుడు ఉన్న కులమత పిచ్చి నుంచి బయట పడాలి అని ఆయన అభిలాష.
నేటి ప్రపంచంలో అవసరాల కోసమె ప్రతి బంధం ఉంది. మనిషిని మనిషిగా ప్రేమించే ప్రపంచాన్ని కోరుకోవడం ఎంత అందమైన ప్రపంచంమో కదా!
ప్రకృతి ఒడిలో హాయిగా నిధురించే ప్రపంచం కావాలి
ప్రకృతిని మించిన అందమైంది ఈ లోకంలో ఏముంది ప్రకృతి తో స్నేహం కోరుకునే కవి హృదయం ఎంత స్వచ్ఛమైందో కదా!.
ఆడ దానిలో అమ్మను చూసే ప్రపంచం కావాలి అట
ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా సర్, ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు ఉంటారు ఏమో అలాంటివారు. అయిన మీరు అడిగే ప్రపంచంలో ఉంటే ఎంత బాగుంటుందో.

స్వార్థం తో మనిషి మానవత్వం మరిచి అడుగడుగున తనని తాను మోసం చేసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మోసం చేసుకొని ప్రపంచం కావాలి అని కోరుకుంటున్నారు రెండు లైన్స్ లో లోకం పోకడాన్ని ఎంత చక్కగా వివరించి. అటువంటి ప్రపంచం కావాలి అని కోరుకుంటున్నారు.
ఒక వ్యక్తి ఎవరినో మోసం చేసుకొనవసరం లేదు. తనని తాను మోసం చేసుకోకుండా ఉన్న చాలు.
మనస్సులో ఒకటిపెట్టుకొని పైకి నటించే మనుస్యులు లేని ప్రపంచం కావాలి అని.. కల్మషం లేని ప్రపంచం కావాలి అని కోరుకుంటున్న నిష్కల్మష మనస్సు కలిగిన కవి హృదయానికి నా హృదయ పూర్వక కుసుమాంజాలి.

కార్తిక్ సర్ మీ ప్రతి రచన వినూత్నoగా ఉంటుంది. అస్సలు మీ కలం ఏ పుణ్యం చేసుకుందో మీ పేరు చెబితే పదాలు భావాలు అన్ని మీకే సొంతం అంటూ మీ ఎదురుగా వస్తాయేమో అనిపిస్తుంది.
గ్రేట్ సర్ ఇలాంటి మరెన్నో మా మనస్సును రంజింప చేయు రచనలు చేస్తూ విజయశిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్న.
ఏదో మీ కవిత చదివి మనస్సు మీరు కోరుకున్న ప్రపంచం కావాలి అనిపించింది. ఆ ప్రపంచాన్ని చేరుకోలేకపోయిన. మీ కవిత కి ఒక చిన్న సమీక్ష ఇవ్వాలని అనిపించింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!