అహంకారం

అహంకారం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పి. వి  యన్. కృష్ణవేణి

గుండెల్లోని ఒక భావమే అయినా
గుండెల నిండా నింపుతుంది భారాన్ని
గుర్తుగా మిగిలిన వ్యక్తులను సైతం దూరం చేస్తుంది
నీలో ఉన్న అహంకారం నిన్ను అదిమేస్తుంది
దరి చేరనీయకూడదు అహంకారం
దూరంగా పెట్టకూడదు ఆత్మీయత భావం
నిన్ను నువ్వు తెలుసుకునే క్రమం
కాకూడదు ఎవరికీ శిరోభారం
మదిలో పెరగాలి నీ పై ఆరాధన
మనసులో నిన్ను నిలుపుకోవాలి ఆ జనం
మన అనుకోవాలి పలువురు హృదయంలో
నిన్ను నువ్వు జయించాలి మనస్పూర్తితో
కన్నీటి జలపాతం కనుపాప తాకగా
నీ నుదుటి మీద రాత నువ్వు మార్చుకో
గుండెల నిండా ప్రేమ భావం నింపుకో
సాటి మనుషులకు విలువ ఇవ్వు
నువ్వు అన్న ఒక్క మాట ముక్కలు చేస్తుంది
నువ్వు నడిచే ఆ బాట వల్ల నిందలు వేస్తుంది
పౌరుషం కాదు మనకి ముఖ్యం
పౌరులుగా జీవనం సాగించటం ముఖ్యం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!